»   » ఆశ్చర్యం: ముదురు హీరోయిన్‌కు రూ. 5 కోట్ల పారితోషికం

ఆశ్చర్యం: ముదురు హీరోయిన్‌కు రూ. 5 కోట్ల పారితోషికం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు బాలీవుడ్లో షారుక్-కాజోల్ జోడీ అంటే చాలా ఫేమస్. బాలీవుడ్ ఐకానిక్ ఫిల్మ్స్ బాజిగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఆల్ టైం హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ ‘మై నేమ్ ఈజ్ ఖాన్' అనే చిత్రంలోనూ జోడీ కట్టారు.

తాజాగా మరోసారి కాజోల్ వెండితెరపై షారుక్ కు జోడీగా కనిపించబోతోంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కాజోల్ త్వరలో బాలీవుడ్లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ మూవీ ‘దిల్ వాలే' చిత్రంలో నటించబోతోందని తెలుస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె షారుక్ కు జోడీగా నటిస్తోందట.

Kajol charges a whopping Rs.5 crore for Dilwale

ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను కాజోల్ కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాంలో ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్లకు మాత్రమే ఈ రేంజిలో పారితోషికం ఉంది. అసలు ఫాంలో లేని, వయసు పైబడిన కాజోల్ కు ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశం అయింది.

కాజోల్ కు ఉన్న ఇమేజ్, టాలెంట్ తో పోలిస్తే ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పలువురు అంటున్నారు. మరో వైపు షారుక్-కాజోల్ జోడీ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాపై క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఆమెకు ఇంత మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసారని అంటున్నారు. ఈ చిత్రంలో షారుక్-కాజోల్‌తో పాటు వరుణ్ ధావన్ - కృతి సనన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి-గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని రోహిత్ శెట్టి చెబుతున్నారు.

English summary
Bollywood actor Kajol is again all set to return on the big screen for the mega budget flick Dilwale. The actor will be seen along with her best on-screen star Shahrukh Khan in the Rohit Shetty film. According to a source of a leading tabloid, Kajol is getting a remuneration of Rs.5 crore for the upcoming movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu