»   » ధనుష్‌తో ఆ విషయం గురించి చర్చించా.. అడిగి తెలుసుకొన్నా.. కాజోల్

ధనుష్‌తో ఆ విషయం గురించి చర్చించా.. అడిగి తెలుసుకొన్నా.. కాజోల్

Written By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాదిలో మెరుపు కలలు చిత్రంతో ప్రేక్షకుల మనుసు దోచుకొన్నది కాజోల్. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ కావడంతో దక్షిణాది వైపే చూడలేదు. వరుస విజయాలతో అగ్రతార అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితమైంది. ఇటీవల షారుక్ ఖాన్‌తో కలిసి దిల్‌వాలే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజోల్. శనివారం వీఐపీ2 చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాజోల్ దేవగన్ మీడియాతో ముచ్చటించారు.

భాషలు అలవాటైపోయాయి.

భాషలు అలవాటైపోయాయి.

వీఐపీ2 షూటింగ్ ప్రారంభమైనప్పుుడు తమిళం, తెలుగు గురించి అసలే తెలియదు. కానీ రెండు, మూడు రోజులకు అలవాటైపోయింది. సన్నివేశాల గురించి సౌందర్య, నేను, ధనుష్ కూర్చుని చర్చించుకొనే వాళ్లం. షూటింగ్ జరిగే కొద్ది తమిళంలో మాట్లాడుకుంటే అర్థమయ్యేది. అయితే తెలుగులో డైలాగ్స్ చెప్పడం కష్టమైంది అని కాజోల్ తెలిపారు

Dhanush And Kajol Speech @ VIP 2 Team Press Meet
అందం గురించి ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొను..

అందం గురించి ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొను..

అందం గురించి తాను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనని కాజోల్ అన్నారు. ఆహారం విషయంలో చాలా పద్ధతిగా ఉంటాను. నీళ్లు ఎక్కువగా తాగుతాను. ఫిట్‌నెస్ కోసం గంట నుంచి గంటన్నర వరకు వర్కవుట్లు చేస్తాను అని కాజోల్ చెప్పారు. ముంబైలో ఉన్నా, అవుట్‌డోర్ షూటింగ్ వెళ్లినా వర్కవుట్లు మాత్రం మానను అని ఆమె అన్నారు.

15వ రీఎంట్రీ..

15వ రీఎంట్రీ..

వీఐపీ2 చిత్రం సెకండ్ ఇన్నింగ్స్ కాదు. ఇలాంటి రీ ఎంట్రీలు ఏన్నో దాటుకుంటూ వచ్చాను. ఇది నాకు 15వ ఇన్నింగ్స్. కాలం ఎప్పుడూ ముందుకెళ్తుంటుంది. గతమే బాగుంది అనుకుని బాధపడితే కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా అని కాజోల్ అన్నారు. ఎప్పుడైనా సమయాన్ని వినియోగించుకొంటూ సంతోషంగా జీవితాన్ని గడుపాలని ఆమె అన్నారు.

సౌందర్య, ధనుష్ సహకరించారు..

సౌందర్య, ధనుష్ సహకరించారు..

సౌందర్య, ధనుష్ సహకరించడంతో భాషా సమస్యను అధిగమించాను. దాంతో నటించడం సులభమైపోయింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటించడం అంత కష్టమేమీ కాదనే కాన్ఫిడెన్స్ వచ్చింది. భవిష్యత్‌లో అవకాశాలు వస్తే తెలుగులో నటిస్తాను అని ఆమె అన్నారు. అన్ని భాషలను గౌరవిస్తాను. ఇతర భాషల్లో నటించగలనా అనే భయం సినిమాతో పోయింది.

నాలుగు రోజుల కోసం ద్వేషం ఎందుకు?

నాలుగు రోజుల కోసం ద్వేషం ఎందుకు?

జీవితం చాలా చిన్నది. బతికే నాలుగు రోజుల కోసం ఒకరితో శతృత్వం, పగ, ప్రతీకారం పెంచుకోవడం అనవసరం. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం తప్పు. సమయం వృథా. ఒకరికి చెడు చేయాలని ఆలోచించడం వల్ల మానసికంగా, శారీరకంగా నష్టపోతాం. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అని కాజోల్ అన్నారు.

English summary
Kajol is making her comeback in Tamil cinema nearly after 2 decades. Her last film was Minsara Kanavu in 1997 and the Hindi dubbed version was titled Sapney. Kajol is starring in Velai Illa Pattathari 2 (VIP2), the sequel to 2014 Tamil runaway hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu