twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఈగ' హిందీ వెర్షన్ లో కాజోల్: రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ'ని హిందీలోకి డబ్ చేసి విడుదల సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ తేదిని అక్టోబర్ 12 కి ఫిక్స్ చేసారు. ఈ చిత్రానికి క్రేజ్ తేవటానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రంలోకి కాజోల్ ని తీసుకు వచ్చారు. అయితే చిత్రంలో కాజోల్ కనిపించదు. ఆమె వాయిస్ వినిపిస్తుంది. సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ లో తల్లి పాత్రకు గానూ కాజోల్ డబ్బింగ్ చెప్పింది. తెలుగు వెర్షన్ లో రాజమౌళి భార్య రమా రాజమౌళి ఈ వాయిస్ ని ఇచ్చారు. ఇక రాజమౌళి వాయిస్ కి అజయ్ దేవగన్ ..డబ్బింగ్ చెప్పారు.

    ఈ విషయాన్ని రాజమౌళి ఖరారు చేస్తూ ట్విట్టర్ లో... వాయిస్ చెప్పినందుకు అజయ్ దేవగన్ మరియ కాజోల్ కి థాంక్స్. సుదీప్ తాను రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఈగ హిందీ వెర్షన్ అక్టోబర్ 12న విడుదల చేస్త్తున్నాం' అన్నారు.

    ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సురేష్ బాబు హిందీ వెర్షన్ నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్ .

    మరో ప్రక్క ఈ చిత్రం పై నేషనల్ మీడియాలో రకరకాలు కథనాలు వెలుబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఈ చిత్రం ఓ ఆస్ట్రేలియన్ షార్ట్ పిలిం నుంచి కాపీ చేసి తీసారంటూ రాసుకొచ్చింది. ఆ షార్ట్ పిలిం పేరు 'Cockroach'(బొద్దింక). మార్చి 2010లో వచ్చిన ఈ షార్టి ఫిలిం కథ దర్శకుడు లూక్ ఈవ్ (Luke Eve). ఈ షార్ట్ ఫిలింలో ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయి బొద్దింక గా పునర్జన్మ ఎత్తుతాడు. బొద్దింకగా తన గర్ల్ ప్రెండ్ ని కలుసుకుంటాడు. అది ఓ రొమాంటిక్ కామెడీ. అయితే రాజమౌళి తన తండ్రి దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ కథను తనకు చెప్పారంటున్నారు.

    English summary
    Kajol has dubbed for the mother's character during the opening lines of Eega's Hindi remake, Makkhi. While director Rajamouli, his wife Rama and their daughter Mayookha, lent their voices for this sequence in the Telugu version, Ajay Devgan and Kajol have dubbed for the same in the Hindi movie. Sharing this news, Rajamouli posted on his micro blogging site "Thanks a lot ajaydevgn for the voice over. And cherry on top is Kajol did the VO for the mother. Makkhi will have a gr8 start. Am i happy?" (sic).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X