»   » స్టేజీపై సిగెరెట్ కాల్చిన హీరోయిన్ కాజల్ తల్లి

స్టేజీపై సిగెరెట్ కాల్చిన హీరోయిన్ కాజల్ తల్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ ఛారిటి ఫంక్షన్ కి హాజరైన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తల్లి తనూజ సిగెరెట్ కాలుస్తూ అందరి దృష్టిలో పడ్డారు. పిల్లలకి చెందిన ఆ ఛారెటీ ఫంక్షన్ లో ఓ ప్రక్క పిల్లలు యాక్ట్ చేసిన పోగ్రామ్ నడుస్తూండగా గెస్ట్ గా హాజరైన ఆమె, స్నేహితురాలు అంజూ మహేంద్ర సిగెరెట్స్ కాలుస్తూ కూర్చున్నారు. విషయం అర్దమయినా ఛారిటీ సంస్ధవారు గెస్ట్ లను ఏమి అనలేక మిన్నకుండి పోయారు. అయితే మీడియా వారు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సిగెరెట్ కాల్చటం ఆమె పర్శనల్ లైఫ్ కు చెందిందే అయినా పబ్లిక్ పంక్షన్ లో అదీ పిల్లలకు గుమిగూడిన చోట కాల్చటం ఎంతవరకూ పద్దతి అని ప్రశ్నిస్తున్నారు. తనూజ సంగతి ఎలా ఉన్నా ఆమె కూతురు కాజల్, అల్లుడు అజయ్ దేవగన్ మాత్రం ఈ విషయమై సిగ్గుపడుతూ సారి చెప్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu