»   » "నిన్ను చంపేస్తాం" అంటూ మహిళా దర్శకురాలికి బెదిరింపులు

"నిన్ను చంపేస్తాం" అంటూ మహిళా దర్శకురాలికి బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ లఘుచిత్ర దర్శకురాలు దివ్యభారతికి చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయట. బీజేపీ, పుదియతమిళగం పార్టీలకు చెందిన వారు తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. మధురై, ఆణైయూర్‌కు చెందిన ఆమె లెనినిస్ట్‌ సంఘంలో పనిచేస్తున్నారు. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేశ్‌ పాము కాటుకు గురై మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని దివ్యభారతి మధురై ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పోరాటం చేసిన కేసులో గత వారం అరెస్ట్‌ అయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

‘Kakkoos’ director Divya Bharathi gets hate calls

తాను నిర్మించిన కక్కూస్‌ లఘు చిత్రాన్ని తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వీరి గురించి విచారిస్తే భారతీయ జనతా పార్టీ, పుదియతమిళం పార్టీ నేత కృష్ణస్వామికి చెందిన వాళ్లమని చెబుతున్నారన్నారు. అయితే వారెవరన్నది పోలీసులు తేల్చాలని కోరారు. అలాంటి వారికి కృష్ణస్వామి బుద్ది చెప్పాలన్నారు. కక్కూస్‌ చిత్రంపై కృష్ణస్వామి కోర్టులో పిటిషన్‌ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలి సిందని, ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. పశుమాంసం ఇతి వృత్తంగా లఘు చిత్రాన్ని రూపొందింస్తురన్నందుకే భారతీయ జనతా పార్టీ నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని భావించాల్సి వస్తోందని ఆమె అన్నారు.

English summary
Divya Bharathi, who made the documentary Kakkoos about manual scavengers, has recently received several hate calls and She said the calls were mostly derogatory and many callers had threatened to kill her or rape her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu