»   » ‘కళా తపస్వి’ కె విశ్వనాథ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘కళా తపస్వి’ కె విశ్వనాథ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శంకరాభరణం, సాగర సంగమం, రుద్రవీణ ఇలా కెరీర్లో అన్ని కళాత్మక చిత్రాలే తేసిన దర్శకుడు కె. విశ్వనాథ్ కళా తపస్విగా పేరుగడించారు. ఆయన చాలా కాలంగా డైరెక్షన్ కు దూరమైనా.... ఇప్పటికీ సినిమాల్లో నటుడిగా తన ప్రస్తానం కొనసాగిస్తూనే ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా తెరకెక్కుతున్న ‘అ..ఆ..' సినిమాలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. రోజు రూ. లక్ష పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కళాతపస్వి లాంటి వారికి ఆమాత్రం రెమ్యూనరేషన్ ఇవ్వడం సబబే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) ప్రారంభోత్సవం ఆల్రెడీ రామానాయుడు స్టూడియోలో కొన్నిరోజుల క్రితమే జరిగింది. ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్' ఫేం) ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Kala Tapaswi K Vishwanath remuneration

తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.

చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే పెద్ద స్టార్స్, భారీ తారాగణం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు.

కానీ నితిన్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాటోగ్రాపర్లనే తన సినిమాలకు ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సౌతిండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
In Trivikram's upcoming film with Nithin and Samantha when Vishwanath was offered a role, The senior actor asked for daily remuneration of 1 lakh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu