twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరుణానిధి ఇకలేరు.. రచనలే ఆయుధం.. మాటలే తూటాలు.. ప్రశ్నించడమే దాడిగా

    By Rajababu
    |

    తమిళ చిత్ర పరిశ్రమ, ద్రావిడ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. దేశ రాజకీయాల్లో కురువృద్ధుడు, రాష్ట్ర రాజకీయాల్లో అపర మేధావిగా, చాణక్యుడిగా పేరున్న కరుణానిధి ఇకలేరు. వృద్యాప్య సంబంధిత వ్యాధులతో కొద్దిరోజులుగా చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళ ప్రజల అస్థిత్వ్వానికి, సినిమా పరిశ్రమ వెలుగు జిలుగులకు కారణమైన తమ నాయకుడు ఇక లేరనే వార్తతో సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రజల సందర్శనార్థం కరుణానిధి భౌతిక కాయాన్ని ద్రవిడ మున్నేత్ర కజగం (డీఎంకే) పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. కరుణానిధి మృతికి సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

    సాటిలేని నేతగా

    సాటిలేని నేతగా

    తమిళ రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా కరుణానిధికి సాటిలేరు. సీఎన్ అన్నాదురై స్థాపించిన ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీలో చేరి విశేష సేవలందించారు. ఆయన ప్రేమ, ఆదరాభిమానలు గెలుచుకొన్నారు. సీఎన్ అన్నాదురై నటించిన నల్ల తాంబీ, వెల్లైకరి చిత్రాలకు రచయితగా పనిచేశారు. పార్టీ సిద్ధాంతాలను ఆయా చిత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

    Recommended Video

    Karunanidhi Passes Away At The Age Of 94 ముగిసిన కరుణానిధి శకం
    రచనలతో ప్రజా చైతన్యం

    రచనలతో ప్రజా చైతన్యం

    అన్నాదురై అడుగు జాడల్లో కరుణానిధి నడుస్తూ సినిమాల ద్వారా పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. రాజకుమారి, మంతిరి కుమారి చిత్రాలు ఆయనను అగ్ర రచయితగా నిలబెట్టాయి. ఆయన రచనలు, మాటలు ప్రతి ఒక్కరిని ఉత్తేజానికి గురిచేశాయి. ఆయన కథలు, రచన, మాటలు బుల్లెట్లలా ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకెళ్లేవి.

    20 ఏళ్ల వయసులోనే

    20 ఏళ్ల వయసులోనే

    కరుణానిధి 20 ఏళ్ల వయసులోనే సినీ రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 40 పైగా చిత్రాలకు సినీ రచయితగా సేవలందించారు. ప్రశాంత్ నటించిన పొన్నార్ శంకర్ కరుణానిధికి రచయితగా చివరి చిత్రం. సినీ రచయితగా విశ్రమించినా.. తుదిశ్వాస విడిచేంత వరకు కవిత్వం, రచనలతో సాహితీ ప్రియులకు చేరువగానే ఉన్నారు.

     మలుపుతిప్పిన పరాశక్తి

    మలుపుతిప్పిన పరాశక్తి

    కరుణానిధి జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం పరాశక్తి (1952). తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రను ఈ చిత్రం తిరగరాసింది. అప్పట్లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచింది. సినిమా పరిశ్రమలో ఉన్న అనేక సంప్రదాయాలను బ్రేక్ చేసింది. అప్పట్లో సినిమాల్లో ఎక్కువ సంఖ్యలో పాటలు ఉండేవి. పాటల సంఖ్యను తగ్గిస్తూ ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

    బోల్డ్ డైలాగ్స్ రచ్చ రచ్చ

    బోల్డ్ డైలాగ్స్ రచ్చ రచ్చ

    పరాశక్తి చిత్రంలో బోల్డ్ డైలాగ్స్‌తో కరుణానిధి దడడదలాడించాడు. బ్రహ్మనిజంను ప్రశ్నించడం అప్పట్లో సంచలనంగా మారింది. పరాశక్తిలో శివాజీ గణేషన్ నటన నభూతో నభిష్యత్ అని ఇప్పటికీ చెప్పుకొంటారు. రాష్ట్రంలోని పరిస్థితుల వల్ల కనీసం నిలువ నీడలేకుండా దారుణమైన జీవితాన్ని గడిపే గుణశేఖరన్ పాత్రలో శివాజీ గణేషన్ జీవించాడు.

    తమిళ సినీ పరిశ్రమ అండగా

    తమిళ సినీ పరిశ్రమ అండగా

    తమిళ చిత్ర పరిశ్రమ అంటే కరుణానిధికి ఎనలేని గౌరవం. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటే తమిళ చిత్ర పరిశ్రమకు అనేక రాయితీలు కల్పించాడు. తమిళ నేటివిటి, తమిళ టైటిల్స్ ఉన్న చిత్రాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం కోలీవుడ్‌కు అభివృద్ధికి దోహదపడింది. కరుణానిధి చొరవ వల్ల తమిళ చిత్రాల్లో భాషకు ప్రాధాన్యం పెరిగింది. వయసు మీద పడుతున్న తమిళ సినిమాతో అనుబంధాన్ని కొనసాగించారు.

     కమల్, రజనీతో సన్నిహితంగా

    కమల్, రజనీతో సన్నిహితంగా

    తమిళ చిత్ర పరిశ్రమలో మలితరం నటులతో సఖ్యతను కొనసాగించారు. రజనీకాంత్, కమల్ హాసన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. యువతరం నటులతో కూడా మంచి రిలేషన్స్ కొనసాగించారు. ఎప్పడూ సినిమా పరిశ్రమ, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డారు.

    English summary
    Muthuvel Karunanidhi, a champion of Dravidian politics and a five-time Tamil Nadu chief minister, has died. He was 94.Chennai's Kauvery hospital said Karunanidhi, the leader of the Dravida Munnetra Kazhagam (DMK) party, died at 6:10 pm today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X