»   » కాలకేయ (ప్రభాకర్) హార్ట్ టచింగ్, ఎమోషనల్ ఇంటర్వ్యూ...

కాలకేయ (ప్రభాకర్) హార్ట్ టచింగ్, ఎమోషనల్ ఇంటర్వ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పాత్ర కాలకేయ. విచిత్రమైన బాష, భయంకరమైన వేషధారణ, హింసాత్మకమైన ప్రవర్తనతో ఉండే ఈ పాత్ర సినిమాలో కీలకంగా నిలిచింది. సినిమాలో ప్రభాస్, రానా తర్వాత ఆ రేంజిలో గుర్తింపు తెచ్చిన పాత్రల్లో కాలకేయ పాత్ర ఒకటి.

ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా కిలికి అనే భాషను సృష్టించారు. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో విలన్లు హీరోలకు తీసిపోకుండా ఉంటారు. బాహుబలి సినిమాలోనూ రాజమౌళి అదే విధానం కొనసాగించారు. మహిష్మతి రాజ్యంపై కాలకేయుడు తన లక్ష మంది సైన్కయంతో విరుచుకుపడి భయోత్పాతం సృష్టించడం...తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభాస్, రానా కాలకేయులతో పోరాడటం సినిమాకు హైలెట్.


Kalakeya Alias Prabhakar's Heart Touching And Emotional Interview: Baahubali

సినిమాలో ఎంతో కీలకంగా నిలిచిన ఈ పాత్ర పోషించింది యాక్టర్ ప్రభాకర్. రాజమౌళి గతంలో తన దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న'లో ప్రభాకర్‌కు మంచి పాత్ర ఇచ్చాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానాలకు సరైన విలన్ అతడే అని భావించిన దర్శకుడు మరోసారి అతనికి గోల్డెన్ చాన్స్ ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు ప్రభాకర్.


సినిమా పరిశ్రమంలో తన జర్నీ, రాజమౌళితో పరిచయం, తన కెరీర్ మలుపు తిరడానికి కారణమైన విషయాలు ఇటీవల టీవీ ఛానల్ తో పంచుకున్నారు. హార్ట్ టచింగా, ఎమోషనల్ గా సాగిన ఆ ఇంటర్వూ వీశేషాలు వీడియోలో....


English summary
Ever since Rajamouli's magnum opus Baahubali was released, that one name that popularly attracted the audience and pulling them to theaters once again is Kalakeya, other than Prabhas and Rana Daggubati.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu