twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వుల పేలుడు (‘పటాస్’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : కళ్యాణ్ రామ్ కు సినిమాలు చేయటం, ఫ్లాఫ్ అవటం భాక్సాఫీస్ వద్ద షరాగా మారింది. ఈ నేపధ్యంలో ఫ్లాపుల పరంపరకు బ్రేక్ ఇవ్వటానికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో కామెడీ,యాక్షన్ కలగలసిన సబ్జెక్టుతో ‘పటాస్' గా ఈ రోజు మనముందుకు రానున్నాడు. ప్రారంభం రోజు నుంచి పాజిటివ్ టాక్ మూటకట్టుకున్న ఈ చిత్రం 370కు పైగా స్క్రీన్ లలో విడుదల అవుతోంది. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్ ద్వారా సినిమా పై మంచి క్రేజ్ ని క్రియోట్ చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని పాటించే ఓ పోలీస్ ఆఫీసర్‌ (కళ్యాణ్ రామ్) కు విధినిర్వహణలో భాగంగా సమాజంలోని కొన్ని దుష్టశక్తుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? తన తెలివితేటలతో ఆ సమస్యల్ని అతడు ఏ విధంగా పరిష్కరించాడు? ఓ మహిళా జర్నలిస్ట్ పరిచయం అతని జీవితంలో ఏవిధమైన మార్పుల్పి తీసుకొచ్చింది? అనేది చిత్ర ప్రధాన ఇతివృత్తం.

    కథ గురించి దర్శకుడు చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.

    Kalayan Ram's Patas movie preview

    దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. పోలీసు అధికారి పాత్రలో కల్యాణ్‌రామ్‌ చేసే సందడి ఆకట్టుకొంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుంది''అన్నారు.

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. భారీ హంగులతో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు.

    వినోదానికి పెద్దపీటవేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సాయికార్తీక్ సంగీతం, సర్వేష్ మురారి ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.కళ్యాణ్ రామ్ బ్యానర్ ప్రతిష్టని మరింతగా పెంచే చిత్రమిది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ టాప్ కమెడియన్స్ అందరూ నటించిన సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం.

    బ్యానర్: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌

    నటీనటులు: కళ్యాణ్ రామ్, శృతి సోది, సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని ఇతర పాత్రధారులు.
    కెమెరా: సర్వేష్‌ మురారి,
    సంగీతం: సాయి కార్తీక్‌,
    ఎడిటింగ్‌: తమ్మిరాజు,
    ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌,
    ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌,
    రచనా సహకారం: ఎస్‌.కృష్ణ.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
    నిర్మాత: కళ్యాణ్ రామ్
    విడుదల తేదీ: 23,జనవరి 2015.

    English summary
    Pataas directed by debutant Anil Ravipudi and produced by Kalyan Ram himself under N.T.R. Arts. Starring Nandamuri Kalyan Ram and Shruti Sodhi playing the lead roles Sai Karthik is composing the music. This film is scheduled to release on today(January 23, 2015).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X