»   »  కళ్యాణ్ రామ్ కు సంకెళ్లు వేయించారే, ఏంటి విషయం

కళ్యాణ్ రామ్ కు సంకెళ్లు వేయించారే, ఏంటి విషయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌ కాంబినేషన్ లో ఇజం అనే మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ న్యూ లుక్ లో కనిపించనుండగా ఆయన సరసన అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది.

గతంలో అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరీ, తన సినిమాలలో ఈ హీరోల లుక్ లు పూర్తిగా మార్చేయటమే కాకుండా కొత్త స్టైల్ తో అతన్ని దింపుతున్నాడు. ఇప్పుడు ఇజం మూవీలోను కళ్యాణ్ రామ్ ని సరికొత్తగా చూపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఆడియో రిలీజ్ పోస్టర్ సైతం చాలా ఆసక్తిగా ఉంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Kalayn Ram's Ism audio to be released on October 5

ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో, టీజర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇక అక్టోబర్ రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ విడుదల కానున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను అక్టోబర్ 5న జరపనున్నట్లు పూరీ జగన్నాథ్ స్పష్టం చేశారు.


ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా చిత్రానికి సంబంధించి ట్రాక్ లిస్ట్ ని విడుదల చేశారు.

కనులు నావైనా .., యే యే యేరా., ఎలా.. ఎలా ..,పోదాడే పొద పొద.., ఇజం ఇజం..., మొత్తం 5 పాటల డిటైల్స్ ని వీడియో ద్వారా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. త్వరలోనే చిత్ర ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు టాక్. ఈ ఆడియోలో పూరీ జగన్నాథ్ ఓ పాట రాయడంతో పాటు స్వయంగా పాడడం విశేషంగా చెప్పుకోవాలి.

గతంలో అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరీ, తన సినిమాలలో ఈ హీరోల లుక్ లు పూర్తిగా మార్చేయటమే కాకుండా కొత్త స్టైల్ తో అతన్ని దింపుతున్నాడు. ఇప్పుడు ఇజం మూవీలోను కళ్యాణ్ రామ్ ని సరికొత్తగా చూపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఆడియో రిలీజ్ పోస్టర్ సైతం చాలా ఆసక్తిగా ఉంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
Puri Jagannadh directed Kalyan Ram starrer 'Ism' is getting ready for release later this month. Date for audio launch has been fixed. The movie's audio event will be held on 5th October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu