»   » గీతాఆర్ట్స్‌ ద్వారా రిలీజ్...అందుకే క్రేజ్

గీతాఆర్ట్స్‌ ద్వారా రిలీజ్...అందుకే క్రేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ద్వారా ఏదన్నా సినిమా రిలీజ్ అవుతోందంటే ఆ క్రేజే వేరు. పెద్ద సినిమాలకు ఎలా ఉన్నా...చిన్న సినిమాలకు ఆ సంస్ధ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందంటే ఏదో విషయం ఉండే ఉంటుంది..లేకపోతే అల్లు అరవింద్ ఎందుకు పంపిణీ చేస్తాడనే ఆలోచనలు అందరిలో కలుగుతాయి. తాజాగా గీతా ఆర్ట్స్ వారు చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కోసం ఎదురుచూస్తున్న 'కాళిచరణ్' ని తీసుకుని విడుదల చేస్తున్నారు. ఈనెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

శ్రీప్రవీణ్‌ మాట్లాడుతూ ''1980లో రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నటుల వేషధారణ, పరిసరాల్ని సినిమాలో చూపిస్తున్నాం. ఇటీవల విడుదలైన గీతాలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. గీతాఆర్ట్స్‌ ద్వారా సినిమాని విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.

Kalicharan Movie Release on Nov 8, 2013

1980 దశకంలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'కాళిచరణ్' . శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయనిర్మాణ దర్శకత్వంలో'గాయం-2' ఫేం శ్రీప్రవీణ్ రూపొందిస్తున్నారు. చైతన్యకృష్ణ, చాందిని, పంకజ్ కేశ్రీ, రావురమేష్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 8న విడుదల అవటానికి ముస్తాబు అవుతోంది. షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తి చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ సమస్యలతో విడుదల లేటు అయ్యిందని తెలుస్తోంది. జగపతిబాబు 'కాళిచరణ్‌' చిత్రానికి తన వాయిస్ ని ఇస్తున్నారు.

నీతి, నిజాయతీలే ఆస్తులుగా జీవించే ఓ తహశీల్దారు కుటుంబం అది. తన అక్రమాలకు అడ్డు వస్తున్నాడని ఓ క్రూరుడు ఆ కుటుంబంపై కక్షగట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరపైనే చూడాలన్నారు చైతన్య కృష్ణ ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'కాళిచరణ్‌'. చాందిని నాయిక. శ్రీ ప్రవీణ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈనెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో నాగినీడు, ప్రవీణ్‌పూడి, నందన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

గతంలో జగపతి బాబుతో గాయం - 2 అనే సినిమా తీసిన ప్రవీణ్ శ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. చైతన్య కృష్ణ ఇంతకు ముందు 'స్నేహగీతం', అది నువ్వే', 'నిన్ను కలిసాక' వంటి చిత్రాల్లో నటించాడు. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన 'అలా మొదలైంది' సినిమాలో అతిధి పాత్ర పోషించాడు. చైతన్య కృష్ణ చేసిన పలు షార్ట్ ఫిల్మ్స్ చూసిన ప్రవీణ్ చైతన్య ప్రతిభ నచ్చి తన తరువాత సినిమా కోసం ఎంచుకున్నాడు. కెమెరా: విశ్వ దేవబత్తుల, సతీష్‌ ముత్యాల, సంగీతం: నందన్‌రాజ్‌, పాటలు: వనమాలి, సదాచంద్ర, కళ: నారాయణ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: అజయ్‌సాయి, ఫైట్స్‌: వెంకట్‌నాగ్‌. సమర్పణ: బేబి మనస్విని.

English summary
Sri Praveen, who debuted as director with ‘Gaayam 2′ is coming up with this new film ‘Kaalicharan’. Kaalicharan is based on real life incidents. Kaalicharan has completed its shooting long back and even audio has been released. The movie is gearing up for release on Nov 8. Chaitanya Krishna is acting as hero in this crime based movie. Chandini is appearing as heroine. Nandan Raj has composed music for Kaalicharan. Jagapathi Babu has given his voice over for important episodes in the movie. Kaalicharan first look and trailers have created interest about the movie and director is confident that the movie will become a hit sure.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu