‘కాళిచరణ్’విడుదల తేదీ ఖరారు

దర్శకనిర్మాత శ్రీప్రవీణ్ మాట్లాడుతూ... 'ఎనభైదశకంలో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన యదార్థసంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాను. రాజకీయ నేపథ్యంలో పగ, ప్రతీకారం ప్రధానాంశాలుగా కథ నడుస్తుంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రమిది. తమిళ్‌లో నామక్కల్ ప్రాంతం నేపథ్యంలో, తెలుగులో పాలమూరు నేపథ్యంలో కథ సాగుతుంది. యథార్థ కథ ఆధారంగా తమిళ్‌లోనే కాదు..తెలుగులోనూ సినిమాలొస్తాయని చెప్పడానికే ఈ సినిమా చేశాను. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎర్రసత్యం అనే నిజపాత్ర ఉంది. ఆ పాత్ర చాలా ఆసక్తికరం. అతడిని ఏపీ సహా తమిళనాడులోనూ చూపిస్తున్నా. ఏపీలో దిల్‌రాజు, బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్, తమిళ్‌లో శశి పంపిణీ చేస్తున్నారు. గురూజీ వర్మ కూడా ఈ చిత్రం చూసి మెచ్చుకున్నారు' అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ-''యథార్థగాదలు తెలుగులో తక్కువ. తమిళ్‌లో ఎక్కువ. 80ల నాటి వాతావరణాన్ని దర్శకుడు యథాతథంగా చూపి బాల్యాన్ని గుర్తుచేశారు'' అన్నారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ-''శ్రీప్రవీణ్ డ్రీమ్‌ప్రాజెక్ట్ ఇది. 10నెలలు కష్టించి పా త్రకోసం గడ్డాలు, మీసాలు పెంచాను'' అన్నారు.
గతంలో జగపతి బాబుతో గాయం - 2 అనే సినిమా తీసిన ప్రవీణ్ శ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. చైతన్య కృష్ణ ఇంతకు ముందు 'స్నేహగీతం', అది నువ్వే', 'నిన్ను కలిసాక' వంటి చిత్రాల్లో నటించాడు. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన 'అలా మొదలైంది' సినిమాలో అతిధి పాత్ర పోషించాడు. చైతన్య కృష్ణ చేసిన పలు షార్ట్ ఫిల్మ్స్ చూసిన ప్రవీణ్ చైతన్య ప్రతిభ నచ్చి తన తరువాత సినిమా కోసం ఎంచుకున్నాడు. కెమెరా: విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్యాల, సంగీతం: నందన్‌రాజ్, పాటలు: వనమాలి, సదాచంద్ర, కళ: నారాయణ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: అజయ్‌సాయి, ఫైట్స్: వెంకట్‌నాగ్. సమర్పణ: బేబి మనస్విని.


Click it and Unblock the Notifications











