»   » పెళ్లి లేకపోయినా రిలేషన్ ఉండటం తప్పేమి కాదని తేల్చి చెప్పింది

పెళ్లి లేకపోయినా రిలేషన్ ఉండటం తప్పేమి కాదని తేల్చి చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరం లేని పేరు కల్కి కొచ్లిన్‌. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ని వివాహం చేసుకుని విడిపోయిన ఆమె గత కొంతకాలంగా నటుడు ఫర్హాన్‌ అక్తర్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అని తిట్టిపోసిన కల్కి, రివర్స్ లో నిజమో అనుకోండి..తప్పేంటని కూడా నిలదీస్కోంది.

అంతేకాదు భారత్‌లో స్త్రీ సమానత్వానికి సరికొత్త అర్థాన్ని చెప్పి వార్తల్లోకి ఎక్కింది. అయితే రీసెంట్ గా కల్కీ తాజాగా పెళ్లి.. సహజీవనంపై తనదైన రీతిలో స్పందించింది. సరైన వ్యక్తితో అనుబంధాన్ని కొనసాగిస్తే పెళ్లితో పని లేదని చెబుతూనే.. ఒప్పందంలా జీవితాంతం వారితో బంధం కొనసాగించాల్సిన అవసరం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kalki Koechlin: Marriage is not necessary for a long-term, committed relationship

కల్కి మాట్లాడుతూ..''నాకు తెలిసి జీవితకాలం అనుబంధాన్ని కొనసాగించాలంటే పెళ్లే చేసుకోనక్కర్లేదు. అది కొంతమందికే సరిపోతుంది. పెళ్లి లేకపోయినా బంధాన్ని కొనసాగించొచ్చు' అని చెబుతోంది.

పైగా గతంలో అనురాగ్‌ కశ్యప్‌ను పెళ్లాడి ఇటీవల విడాకులు తీసుకున్న కల్కీకి జీవితంలో పెళ్లి పెద్ద విషయమే కాదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. అయితే.. ఇన్ని నీతులు చెప్పిన కల్కీ చివరకు తన జీవితంలోకి మరెవరైనా వచ్చారా అంటే మాత్రం 'వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను' అంటూ ముగించేసిందట.

ఇక ''నా జీవితంలో ఇప్పటివరకు అమాయకత్వంతో చేసిన పని నా పెళ్లి. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడమంటే అతని మీద మనం చాలా నమ్మకం ఉంచడమే. అందుకే పెళ్లి చాలా అందంగా ఉంటుంది అంటుంటాను. అయితే వివాహం చేసుకోవాలంటే మాత్రం చాలా అమాయకత్వం ఉండాలి'' అని తేల్చి చెప్పేసింది. అదీ విషయం.

English summary
Kalki Koechlin, who was earlier married to director Anurag Kashyap, feels marriage is not a necessity if one is in a committed relationship.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu