»   » తొలి యాక్షన్ 3డి చిత్రం మాదే: కళ్యాణ్‌రామ్

తొలి యాక్షన్ 3డి చిత్రం మాదే: కళ్యాణ్‌రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓం'. భారతదేశపు తొలియాక్షన్ 3డి మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్.

కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ 'నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తొలి యాక్షన్ 3డి చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం వుంది' అన్నారు.

3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు. ఇటీవలే ఆడియో విడుదల చేసారు. కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ...యాక్షన్‌ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి. యాక్షన్‌ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టాం అన్నారు.

ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

English summary
Kalyanram’s prestigious film Om finished all censor formalities and is set to the hit the screen on June 28th. Kriti Kharbanda and Nikesha Patel have played the lead roles in the film and Sunil Reddy has directed the film. Kalyan Ram has produced the film under NTR Arts banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu