India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bimbisara Twitter Review: బింబిసారకు అలాంటి టాక్.. అఖండ, RRR తర్వాత ఇదే.. అదొక్కటే పెద్ద మైనస్

  |

  నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత ఓ రేంజ్‌లో సక్సెస్ అయిన హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అయితే, వీళ్ల తర్వాత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో మాత్రం కల్యాణ్ రామ్ అనే చెప్పాలి. కెరీర్ ఆరంభం నుంచి తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ నందమూరి హీరో.. చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 'బింబిసార' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? దీనిపై ట్విట్టర్‌లో ఎలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి? ఓవరాల్‌గా ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ మీకోసం!

  బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
  బింబిసారగా వచ్చిన కల్యాణ్ రామ్

  బింబిసారగా వచ్చిన కల్యాణ్ రామ్

  నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే ‘బింబిసార'. మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష ఇందులో కీలక పాత్రలు చేశారు.

  శ్రీహాన్‌ను మోసం చేసిన సిరి హన్మంత్: అడ్డంగా దొరికి బుక్కైపోయిన బ్యూటీ

  అలాంటి స్టోరీ... టైం ట్రావెల్‌తోనే

  అలాంటి స్టోరీ... టైం ట్రావెల్‌తోనే

  నందమూరి హీరో కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ‘బింబిసార' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడం.. ఇక్కడి పరిస్థితులు చూసి ఆయనలో పరివర్తన రావడం.. ఆ తర్వాత ఆయన రాజ్యంలో ఎలాంటి పరిపాలన చేశాడు అనే నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది.

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్ రిలీజ్

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్ రిలీజ్

  కల్యాణ్ రామ్ ‘బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 15.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

  శివాని రాజశేఖర్ అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించడంతో!

  కల్యాణ్ రామ్ మూవీకి టాక్ ఏంటి

  కల్యాణ్ రామ్ మూవీకి టాక్ ఏంటి

  కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార' మూవీ టైం ట్రావెల్‌తో సాగే సోషియో ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది ఈ సినిమా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ‘బింబిసార' మూవీ ఓవరాల్‌గా చూస్తే.. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంతో సమయం తీసుకోలేదట. కల్యాణ్ రామ్ ఇంట్రో సీన్ అదిరిపోయేలా డిజైన్ చేశాడట. ఇక, ఇంటర్వెల్ కూడా ఆకట్టుకునేలా ఉందట. ఇక, సెకెండాఫ్ కూడా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సీన్లతో నడుస్తుందట. మొత్తంగా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ బాగుందని తెలిసింది.

  యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో: అబ్బో ఆమె అందాలు చూసి తట్టుకోగలరా!

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే


  సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన ‘బింబిసార'ను చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో కల్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, వీఎఫ్ఎక్స్‌లో నాణ్యత లేకపోవడం, పాటలు టైమింగ్ మిస్ కావడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్తున్నారు.

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే


  ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార' టైం ట్రావెల్‌తో సాగే సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. ఇందులో బింబిసారుడు ప్రస్తుత కాలానికి వస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేవి చక్కగా చూపించారట. మరీ ముఖ్యంగా త్రిగర్తల సామ్రాజ్యం ద్వారా ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారట. మొత్తంగా ఈ చిత్రం అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది.

  దీప్తి సునైనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్దులు: నీ ప్రవర్తన ఏంటి అంటూ వీడియో వదిలి మరీ!

  అఖండ, RRR తర్వాత ఇదేనట

  అఖండ, RRR తర్వాత ఇదేనట

  ‘బింబిసార' మూవీని చూసిన నందమూరి అభిమానులు తెగ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు, గత ఏడాది ‘అఖండ'తో బాలకృష్ణ, RRRతో ఎన్టీఆర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కల్యాణ్ రామ్ ‘బింబిసార'తో విజయాన్ని అందుకున్నాడని, నందమూరి హీరోల హ్యాట్రిక్ అని కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. Now Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X