»   » నా సినిమాలు నేనే ఎందుకు నిర్మించుకుంటున్నానంటే...కళ్యాణ్ రామ్

నా సినిమాలు నేనే ఎందుకు నిర్మించుకుంటున్నానంటే...కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"కత్తి" చిత్రంతో మరో సారి చతికిలబడ్డ కళ్యాణ్ రామ్ రీసెంట్ గా టీవీ నైన్ ఛానెల్ తో మాట్లాడుతూ..తను ఎందుకు నిర్మాతగా మారాడో వివరించాడు. అతను మాటల్లోనే...నేను నా సొంత బ్యానర్ పై నా సొంత డబ్బుతో సినిమాలు నిర్మిస్తున్నాను. లాస్ వస్తే నేనే భరిస్తున్నాను. మరో నిర్మాత నా వల్ల లాస్ కాకూడదని నా ఆలోచన. అలాగే జనం నన్ను చూసి నవ్వుకోవటం ఇష్టం ఉండదు. వేరే నిర్మాత నాతో చిత్రం నిర్మించి నష్టపోతే జనం నన్ను చూసి ఓ నిర్మాతను నష్టపరిచానని నవ్వుకోవచ్చు. అందుకే నా సొంత బ్యానర్ పై సొంత రిస్కుతో సినిమా చేస్తున్నాను అన్నారు. కళ్యాణ్ రామ్ గత చిత్రాలు అతనొక్కడే, హరేరామ్, జయీభవ కూడా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై చేసినవే.

ఇక కత్తి చిత్రం గురించి చెబుతూ....రచయిత వక్కంతం వంశీ కథ చెప్పినప్పుడు..ఈ చిత్రంలో వైవిధ్యమైన పాయింట్ ఏముంది అనే సందేహం అతడిముందు వ్యక్తం చేశాను. అయితే అతను చెప్పిన కథలో గత చిత్రాల్లో లేని ఓ కొత్తపాయింట్‌ ఆకర్షించింది. 'పాతతరం మనుషులు అంత తేలిగ్గా మారరు. తమవైన భ్రమల్లో ఉంటారు. అలాంటప్పుడు వారి దారిలోనే వెళ్లి మారిస్తే.." ఇదే ఆ కొత్త పాయింట్‌. సడన్ ‌గా మరని వాళ్లకోసం 'సమరసింహా రెడ్డి"లో ఓ డైలాగ్‌ ఉంది. 'మీరు మారొచ్చు. మా పగలు మారవు" ఇదే..ఇన్‌ స్పిరేషన్‌ అంటూ తను కత్తి చిత్రం చేయటానికి ప్రేరణగా నిలిచిన విషయాలు చెప్పారు కళ్యాణ్ రామ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu