Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అతనితో కమిటైపోయిన నందమూరి హీరో.. తొలిసారే సక్సెస్ కానున్నారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేటితరం హీరోల్లో తారక్‌తో పాటు కళ్యాణ్ రామ్ బాగా సక్సెస్ అయ్యారు. హరికృష్ణ తనయులుగా తమ కుటుంబ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సూపర్ డూపర్ హిట్స్ తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ విషయానికొస్తే.. ఓ వైపు హీరోగా రాణిస్తూనే నిర్మాతగా తనదైన రోల్ పోషిస్తున్నారు.
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థను స్థాపించిన నందమూరి కళ్యాణ్ రామ్.. కొత్త తరం కథలతో సినిమాలు రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే తమ్ముడు తారక్, అన్నయ కళ్యాణ్ రామ్ కలిసి జై లవకుశ సినిమాలో భాగస్వాములయ్యారు. తెర వెనుక కీలకంగా ఉంటూనే మరోవైపు తెరపై హీరోగా కూడా దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. కొద్ది రోజుల క్రిందటే 118 అనే థ్రిల్లింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఆవేరేజ్ టాక్ తెచ్చుకున్నారు. అయితే దీని తర్వాత తన సొంత ప్రొడక్షన్ హౌస్ ఎన్‌టిఆర్ ఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. వేణుమల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అశ్వత్థామ, తుగ్లక్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా తన కథల ఎంపికలో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా మరో డైరెక్టర్‌తో కూడా కమిటైపోయారని తాజా సమాచారం. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న రీసెంట్‌గా ఒక కుటుంబ కథతో కళ్యాణ్ రామ్ వద్దకు వెళ్లగా ఆ కథ విని వెంటనే నందమూరి కళ్యాణ్ రామ్ సతీష్‌కు పచ్చజెండా ఊపాడని ఫిలిం నగర్ టాక్. ఇదే నిజమైతే సతీష్ వేగేశ్న, కళ్యాణ్ రామ్ కాంబోలో వచ్చే మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ వారు నిర్మించబోతున్నారని మరో సమాచారం. ఏదేమైనా కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఓ రేంజ్ అంచనాలు మొదలైయ్యాయి. ఇటీవలే సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఆశించిన మేర రాణించలేక పోయింది.