»   » బాబాయ్ సారీ.. మనసులో పెట్టుకోకుండా.. కల్యాణ్ రామ్ ఎమోషనల్

బాబాయ్ సారీ.. మనసులో పెట్టుకోకుండా.. కల్యాణ్ రామ్ ఎమోషనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
MLA Movie Pre Release Event : Kalyan Ram Emotional On 'Babai'

జై లవకుశ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ఎంఎల్ఏ (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి). అందాలతార కాజోల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. సీ భరత్ చౌదరి, యంవీ కిరణ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కల్యాణ్ రామ్ కొంత ఎమోషనల్ అయ్యాడు.

ఫంక్షన్‌కు అల్లరి నరేష్

ఫంక్షన్‌కు అల్లరి నరేష్

ఎంఎల్‌ఏ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హీరో అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పోసాని కృష్ణమురళి తదితరులు పాల్గోన్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని అందరూ అక్షాంక్షించారు. ఈ వేడుకలో పోసాని ప్రసంగం ఆసక్తిగా సాగింది. కల్యాణ్ రామ్‌ను హీరోగా చేయాలని హరికృష్ణ, నేను మాట్లాడుకొన్నామనే విషయాన్ని ఈ సందర్బంగా పోసాని వెల్లడించారు.

బాబాయ్ అని పిలిచేది

బాబాయ్ అని పిలిచేది

ప్రీ రిలీజ్ పండుగలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలో బాలయ్య బాబాయ్ తర్వాత బాబాయ్ అని పిలిచే ఏకైక వ్యక్తి అల్లరి నరేష్. తను నాకు చాలా క్లోజ్. ఫిల్మ్‌నగర్‌లో మా ఇద్దరి ఆఫీసులు పక్క పక్కనే ఉంటాయి. మా మధ్య చాలా మంచి అనుబంధం ఉంది అని అన్నారు

పెళ్లి కాకముందు

పెళ్లి కాకముందు

నా పెళ్లికాక ముందు వరకు నేను నరేష్ రెగ్యులర్‌గా కలిసే వాళ్లం. ఆ తర్వాత ఎందుకో కుదరడం లేదు. తాను కలుద్దాం అంటాడు. నేను సరే అంటాను. కానీ కలుసుకోలేకపోతాం. కానీ మా మధ్య అనుబంధం మాత్రం బాగానే ఉంటుంది.

మనసులో పెట్టుకోకుండా వచ్చావు

మనసులో పెట్టుకోకుండా వచ్చావు


తన సినిమా ఆడియో ఫంక్షన్ ఏది జరిగినా మొదటి కాల్ నాకే చేస్తాడు. కానీ నాకే ఎప్పుడూ వెళ్లడం కుదరలేదు. సారీ బాబాయ్..నువ్వు చాలాసార్లు పిలిచినా రాలేకపోయాను. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నా ఫంక్షన్ కు వచ్చి నాకు బెస్ట్ విషెస్ చెప్పావు. చాలా థ్యాంక్స్. ఈసారి మాత్రం నీ సినిమా ఫంక్షన్‌కు ఖచ్చితంగా వస్తాను అని కల్యాణ్ రామ్ అనడం అందర్ని ఆకట్టుకొన్నది.

English summary
Kalyan Ram latest movie is MLA. This movie set to release on March 23rd. Allari Naresh and Vamshi Paidipally attended for Pre release event which organised recently. In this event, Kalyan Ram gets emotional about the Allari Naresh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X