»   » ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kalyan Ram Emotional Speech At Jai Lava Kusa Trailer launch

'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా మా ఇద్దరి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా అవుతుందన్నారు.

బాబీ కథ చెప్పినపుడు నాకు గుర్తుకొచ్చింది 'దాన వీర శూర కర్ణ'... ఆ సినిమాను ఎవరూ టచ్ చేయకూడదని నా పర్సనల్ ఫీలింగ్. ఆ సినిమా తర్వాత అంత గొప్ప కథలాగా అనిపించింది 'జై లవ కుశ'. బాబీ కథ చెప్పినపుడు విత్ టైటిల్ తో చెప్పాడు. తారక్ తప్పించి ఎవరూ ఈ సినిమా చేయలేరు.... అని కళ్యాణ్ రామ్ అన్నారు.

వారం సమయం తీసుకున్నాడు

వారం సమయం తీసుకున్నాడు

తారక్ కు, నాకు మధ్య వేరే లెవల్‌లో డిస్క్రషన్స్ జరుగుతుంటాయి. జనతా గ్యారేజ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. దాని తర్వాత మా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో ఇద్ద‌రూ క‌లిసి ఎలాంటి సినిమాలు చేస్తే బావుంటుందోన‌ని చాలా డిస్క‌స్ చేసుకున్నాం. ఆ తర్వాత బాబీ చెప్పిన కథను తారక్ కుచెప్పాను. ఈ సినిమా క‌థ విని సినిమా చేద్దామా? లేదా? అని తార‌క్ వారం రోజులు స‌మ‌యం తీసుకున్నాడు. అంత సమయం తీసుకోవడంతో చాలా టెన్షన్ పడ్డాను అని... కళ్యాణ్ రామ్ తెలిపారు.


కన్విక్షన్ కోసమే...

కన్విక్షన్ కోసమే...

ఈ క్యారెక్టర్ చేయాలంటే ఓ కన్విక్షన్ ఉండాలి. ఆ క‌న్విక్ష‌న్ కోసమే అంత సమయం తీసుకున్నాడు. సినిమాలో న‌త్తి క్యారెక్టర్ ఉంది. ఎవరైనా ఆ నత్తితో మాట్లాడగలరా? లేదు కదా.... నేను చాలా టెన్షన్ పడ్డాను. నాకు ఇంత బాగా నచ్చిన కథ తాతగారిని గుర్తు తెచ్చే కథ, నువ్వు తప్ప ఎవరూ చేయలేరు అని చెప్పిన తర్వాత కూడా వారం తీసుకున్నాడు ఎందుకు? అని ఆలోచిస్తే..... మళ్లీ కలిసిన తర్వాత రావణాసురుడి డైలాగ్ చెప్పాడు. ఆ వారం పాటు ఆ పాత్రను, డైలాగులను ఎలా డెలివరీ చేయాలని బాగా ఆలోచించాడు. ఈ స్టోరీ చెప్పినరోజు నుండి తను ప్రతిక్షణం ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయాడు... అని కళ్యాణ్ రామ్ అన్నారు.


ప్రణతి భయపడింది

ప్రణతి భయపడింది

సినిమాలో ముందు మేం రావ‌ణ పాత్ర‌ను చిత్రీక‌రించాం. ఒక రోజు రాత్రి మూడింటికి నిద్ర‌లో లేచి న‌డుచుకుంటూ న‌త్తితో మాట్లాడుతున్నాడు. న‌డుచుకుంటూ వెళ్లిపోయి కిటికీ ఓపెన్ చేసిన అలా కాళ్లు బయటకు పెట్టాడు. విరిగిపోయిన చిన్న మిర్రర్ పీస్ గుచ్చుకుంది తన కాలుకుకి, తనకి తెలియను కూడా తెలియలేదు. మ‌ర్నాడు ప్ర‌ణ‌తి ఫోన్ చేసి చెప్పింది. ఏమవుతుందో అని ప్రణతి భయపడింది. త‌ను అంత‌గా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు.... అని కళ్యాణ్ రామ్ తెలిపారు.


షూటింగ్ ఆపుదామంటే ఒప్పుకోలేదు

షూటింగ్ ఆపుదామంటే ఒప్పుకోలేదు

వారం రోజులు షూటింగ్ ఆపుదాము, నీ బ్రెయిన్ ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది అంటే తార‌క్ ఒప్పుకోలేదు. అన్నా మనం సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తామ‌ని ప్రామిస్ చేశాం క‌దా అని చెప్పాడు.


చాలా కష్టపడ్డాడు

చాలా కష్టపడ్డాడు

షూటింగ్‌లో చాలా కాస్ట్యూమ్స్ మార్చారు. ఎవ‌రూ కూడా అన్ని మార్చ‌రు. కానీ తార‌క్ మార్చాడు. ఈ సినిమాకు టెక్నీషియ‌న్స్ కూడా బాగా స‌హ‌క‌రించారు. సినిమాపై చాలా కన్ఫిడెంటుగా ఉన్నాను. ఈ సినిమా తాతగారికి దాన వీర శూర కర్ణ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తారక్ కు ఈ సినిమా అంత పెద్ద హిట్టవుతుంది. ఇది అన్నదమ్ముల ఎమోషన్. నేను, తారక్ చాలా ఎమోషన్ గా ఉంటాం. ప్రతి ఇంట్లోనూ ఎమోషన్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా పెద్ద హిట్టువుతుందనే నమ్మకం ఉంది... అని కళ్యాణ్ రామ్ అన్నారు.


హరికృష్ణ మాట్లాడుతూ

హరికృష్ణ మాట్లాడుతూ

హ‌రికృష్ణ మాట్లాడుతూ ``అన్న‌ద‌మ్ముల అనుబంధం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మాణానికి ఆద్యుడు స్వ‌ర్గీయ జాన‌కిరామ్ బాబు. వాళ్ల ముగ్గురూ కూర్చుని తాత‌గారి పేరున్న బ్యాన‌ర్‌లో తాత‌గారి పేరు పెట్టుకున్న త‌మ్ముడితో సినిమాలు చేయాలి క‌దా.. అని అనుకున్నారు. అలా ఈ సినిమాకు బీజం ప‌డింది. దానికి అనుగుణంగా ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు న‌డుస్తున్నారు`` అని చెప్పారు.English summary
Producer Kalyan Ram emotional speech at Jai Lava Kusa theatrical trailer launch Event. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu