»   » కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ ఏంటంటే..

కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ ఏంటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం దర్శకుడుగా అభిమన్యు మల్లిని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్ పెట్టారని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంపై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. 'కిక్' వంటి హిట్ చిత్రానికి కథ అందించిన వక్కంతం వంశి ఈ చిత్రానికి కూడా కథ అందిస్తున్నాడు. ఇక నూతన దర్శకుడు నరేన్ కొండేపాటితో చేసిన జయాభవ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే కళ్యాణ్ రామ్ ఇంతకు ముందు 'హరేరామ్' అనే టైటిల్ పెట్టి హర్ష వర్ధన్ (స్వర్ణ సుబ్బారావు) తో సినిమా చేసారు...అదీ వర్కవుట్ కాలేదు. వీటికి తోడు ఈ టైటిల్ ని పోలిన రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా 'రామ రామ కృష్ణ కృష్ణ' అనే చిత్రం ఈ బుధవారం రిలీజవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu