తక్కువ సమయంలో సినిమా పూర్తి.. దర్శకుడి డేరింగ్ నిర్ణయం!
నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటి తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'నా నువ్వే'. తమిళ దర్శకుడు జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించడం జరిగింది.
హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ 'నా నువ్వే' ఆల్బుమ్ స్పెషల్ గా నిలిచిపోతాయనడంలో సందేహమే లేదు. సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ సినిమా కోసం చక్కటి మెలోడిస్ ను ఇవ్వడం జరిగింది. ప్రియులను మెప్పించే ఈ పాటలు సినిమాను మంచి మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేలా ఉన్నాయి. సినిమా విజయానికి ఈ పాటలు దోహదపడే అవకాశం ఉంది. ఈ సినిమా నిడివి గంట యాభై ఎనిమిది నిమిషాలు మాత్రమె ఉంది. తక్కువ రన్ టైం లో సినిమా కంప్లీట్ చేసారు దర్శకుడు.

ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా రేడియో జాకీగా కనిపించబోతోంది. ప్రముఖ కెమెరామెన్ పి.సి.శ్రీ రామ్ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పనిచేయడం జరిగింది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించబోతున్నాడు. ప్యూర్లవ్ స్టోరి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్మంచి విజయం సాధించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











