»   » 'పటాస్‌' విజయయాత్ర : కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోనిల్లో (ఫొటోలు)

'పటాస్‌' విజయయాత్ర : కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోనిల్లో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కర్నూలు : 'పటాస్‌' విజయం మరింత బాధ్యత పెంచిందని పటాస్‌ చిత్ర హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు. పటాస్‌ చిత్రం విజయోత్సవాల్లో భాగంగా చిత్ర బృందం కర్నూలులోని ఆనంద్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌లో సందడి చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ సందర్భంగా చిత్ర హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ 'పటాస్‌' చిత్రం కథ విన్నపుడే విజయం సాధిస్తుందని నమ్మకం కలిగిందన్నారు. మా నమ్మకం ఇప్పుడు నిజమైందన్నారు. 10 సంవత్సరాల నుంచి విజయం కోసం పరితపించామని, ఇప్పుడు 'పటాస్‌' చిత్రంతో ఆ కోరిక నెరవేరిందన్నారు. కష్టాల్లో కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు.


చిత్రం ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో మంచి స్పందన వస్తోందని, ఎక్కడా చూసినా.. హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌ వస్తున్నాయని తెలిపారు. సినిమాలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను అలరించారు. ఈయన వెంట డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, చిత్ర నటులు షమీర్‌, చైతన్య, అభిమాన సంఘం నాయకుడు గౌతమ్‌, మౌలాలి, తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ బృందం ఎమ్మిగనూరు, ఆదోనిల్లో పర్యటించారు.


స్లైడ్ షో లో ఆ ఫొటోలు...


బ్యానర్ పై

బ్యానర్ పై

నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకుడిగా నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘పటాస్‌'.


చాలా కాలం తర్వాత హిట్

చాలా కాలం తర్వాత హిట్

ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కు హిట్ రావటంతో చాలా ఆనందంగా ఉన్నారు.కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.

‘‘ తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌, బాబాయ్‌ బాలకృష్ణతో మల్టీస్టారర్‌ చిత్రంలో నటిచండానికి నేను సిద్ధంగా ఉన్నాను'',అన్నారు.విజయయాత్రలు

విజయయాత్రలు

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ విజయయాత్రను నిర్వహిస్తోంది.ఎక్కడెక్కడకి

ఎక్కడెక్కడకి

పటాస్ చిత్రం ఆడుతున్న థియోటర్స్ కు వెళ్లి అక్కడ వారి సంతోషాన్ని చూస్తూ పంచుకుంటున్నారు


కర్నూలు

కర్నూలు

అక్కడ అభిమానులు కళ్యాణ్ రామ్ రావటంతో ఉత్సాహంతో ఆయనకి స్వాగతం పలికారు


ఎమ్మిగనూరు, ఆదోనిల్లో పర్యటన

ఎమ్మిగనూరు, ఆదోనిల్లో పర్యటన

ప్రత్యేకబస్సులో వచ్చిన నటులను నగర సరిహద్దుల్లో మేళతాళాలతో స్వాగతం పలికారుపూర్ణ కుంభంతో

పూర్ణ కుంభంతో

కొన్నిచోట్ల తెలుగు దేశం పార్టీ శ్రేణులు నందమూరి కుటుంబ అభిమానులు స్వాగత తోరణాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్నారు.


ర్యాలీ

ర్యాలీ

అనంతరం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ కొనసాగింది.సిరి థియోటర్ లో..

సిరి థియోటర్ లో..

సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో జరిగిన విజయోత్సవంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడారు.పెద్ద పండుగ

పెద్ద పండుగ

పటాస్‌ సినిమా విజయవంతం కావటం నందమూరి కుటుంబానికి పెద్ద పండుగగా అభివర్ణించారు.దిల్ రాజు హ్యాపీ

దిల్ రాజు హ్యాపీ

ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ..కలెక్షన్స్ బాగున్నాయని అన్నారు.ఈ యాత్రలో

ఈ యాత్రలో

డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, చిత్ర నటులు షమీర్‌, చైతన్య, అభిమాన సంఘం నాయకుడు గౌతమ్‌, మౌలాలి, తదితరులు పాల్గొన్నారువేలాది మంది నందమూరి అభిమానులు పాల్గొన్నారు.


English summary
Patas Vijayotsava Yatra - Overwhelmed by the welcome given by Nandamuri fans and well wishers
Please Wait while comments are loading...