»   »  అబ్బాయ్ చేతికి బాలయ్య 100వ సినిమా!

అబ్బాయ్ చేతికి బాలయ్య 100వ సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో కెరీర్లో 100వ సినిమా మార్కను అందుకోబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి హిట్ చిత్రాలు అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య 100వ సినిమా నిర్మాణ బాధ్యతలు దక్కించుకోవడానికి ప్రముఖ నిర్మాతలందరూ ట్రై చేస్తున్నారు. చివరకు ఈ అవకాశం కళ్యాణ్ రామ్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా ‘నందమూరి తారక రామారావు ఆర్ట్స్' బేనర్లోనే ఈ చిత్రం నిర్మాణం కాబోతోందని అంటున్నారు.

బాలయ్య ఈ చిత్రాన్ని తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అంకితం ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక సినిమాను తమ ఫ్యామిలీ బేనర్లోనే చేస్తేనే బావుంటుందని బాలయ్య భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప ఏ విషయం అనేది తేలనుంది.

Kalyan Ram to produce Balakrishna's 100th film

బాలయ్య 100వ సినిమా అంటే ఎలా ఉండాలి? అదరి పోవాలి...టైటిల్ ఇప్పటి వరకు వచ్చిన టైటిల్స్ అన్నింటికీ ధీటుగా, బాలయ్య కెరీర్‌కు అద్దం పట్టే విధంగా ఉండాలి. అందుకే ఈ చిత్రానికి ‘చరిత్రకొక్కడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమారారం.

బాలయ్య 98వ సినిమా ‘లయన్' విషయానికొస్తే...ఈ చిత్రం మే 1న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో మే 7కు వాయిదా పడింది. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.

English summary
Actor-producer Nandamuri Kalyan Ram will produce his uncle Nandamuri Balakrishna's 100th Telugu film, which is tentatively titled "Dictator" and will be helmed by Boyapati Srinu.
Please Wait while comments are loading...