»   »  బాబాయ్ తో కళ్యాణ్ రామ్ సినిమా ఓ.కె?

బాబాయ్ తో కళ్యాణ్ రామ్ సినిమా ఓ.కె?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
మొత్తానికి బాలకృష్ణ సినిమా ఫైనలైంది. అయితే నిర్మాత మరెవరో కాదు ...కళ్యాణ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రం అక్టోబర్ లో ప్రారంభం కానుంది. పాండురంగడు సినిమా తర్వాత ఆయన ఏ సినిమాని ఒప్పుకోకపోవటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ లోగా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి.కొందరైతే ఫొటో సెషన్ చేసి మరీ కథను ఒప్పించారని వార్తలు వచ్చాయి. అయితే వాటిన్నిటికీ భిన్నంగా ఆయన తన అన్న కుమారుడు సినిమాను ఓకె చేసి అందరినీ విస్మయపరిచారని తెలుస్తోంది.

బివిఎస్ రవి అనే రచయిత నేరేట్ చేసిన కథ బాలకృష్ణకు నచ్చటంతో మిగతా ప్రి ప్రొడక్షన్ పనుల్లో కళ్యాణరామ్ టీమ్ నిమగ్నమయ్యారు. కళ్యాణరామ్ ఇదే బ్యానర్ పై అతనొక్కడే,హరే రామ్ చిత్రాలు నిర్మించారు. ఇప్పుడీ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా భావించి భారీగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే దర్శకుడు ఎవరనేది ఫైనలైజ్ కానుంది. అయితే అతను బాలయ్యకు సన్నిహితుడని తెలుస్తోంది. అంటే త్వరలోనే మరో మెగా హిట్ కు అంకురార్పణ జరగనుందిని నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X