»   » తమ్ముడు ఎన్టీఆర్ ఓ సలహా ఇచ్చాడు...కళ్యాణ్ రామ్

తమ్ముడు ఎన్టీఆర్ ఓ సలహా ఇచ్చాడు...కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ చిత్రాన్ని చూసిన తమ్ముడు తారక్ (ఎన్టీఆర్) ।అన్నయ్యా..! డాన్స్‌ లు ఇరగదీశావ్, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. అంతేకాదు..సెకండాఫ్ ‌లో మరో పవర్ ‌ఫుల్ డైలాగ్ పెట్టి వుంటే బాగుండేది అనే సలహాను కూడా ఇచ్చాడు. ఇటీవల ఓ అభిమాని...బాలయ్య సింహా, ఎన్టీఆర్ బృందావనం ఇప్పుడు మీ కత్తి హిట్ అయ్యాయి. ఈ 2010 నందమూరి నామ సంవత్సరంగా చెప్పుకొవచ్చు అనగానే హ్యాపీగా అనిపించింది. అలాగే చంద్రబాబు నాయుడుకు ఇందులోని సిస్టర్ సెంటిమెంట్ బాగా నచ్చింది అంటున్నారు కళ్యాణ్ రామ్. సొంత బ్యానర్ ఎన్‌టిఆర్ ఆర్ట్స్ పై నిర్మించిన 'కళ్యాణ్ ‌రామ్ కత్తి" ప్రమోషన్ లో భాగంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

అలాగే నా నటన 'కత్తి" అంటున్నారు. ముఖ్యంగా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లందరూ సంతోషంగా ఉన్నారు. సిస్టర్ సెంటిమెంట్ ‌తో గతంలో అనేక చిత్రాలు వచ్చినా, దీనిని కొత్త ఫ్యాక్టర్‌లో తీశాం. ఫస్టాఫ్ లో వినోదం, సెకెండ్ హాఫ్ లో ఎమోషన్ బాగా పండాయి. ఇందులో రెండు గెటప్స్‌లో కనిపిస్తాను. ముఖ్యంగా ఈ చిత్రంలో పరిణితి గల నటనను ప్రదర్శించానని ప్రశంసలు లభిస్తున్నాయి..ఇంటర్వెల్ పాయింట్ ప్రేక్షకులను ఆసక్తికి గురి చేస్తుంది. మల్లికార్జున్ మంచి కమర్షియల్ దర్శకుడు. మహిళలు, మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. 'అతనొక్కడే" తర్వాత నాకు అంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నా తదుపరి చిత్రాలకు సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి వేరే నిర్మాణ సంస్థలోనే నటిస్తాను. జనవరిలో చిత్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu