»   » ‘ఎమ్యెల్యే’ కల్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్ రిలీజ్

‘ఎమ్యెల్యే’ కల్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ పక్క జై లవకుశ చిత్రాన్ని నిర్మిస్తూనే మరో పక్క సొంత సినిమా ఎంఎల్ఏను వేగంగా పట్టాలెక్కించాడు నందమూరి కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రూపొందిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇటీవల కాజల్ చిత్ర యూనిట్‌తో కలిసింది. ఆమెపై ఇటీవల కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.


ఎమ్మెల్యే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్‌కుమార్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ రామ్ పోస్టర్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ నంద‌మూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ ఏడాది చివ‌రిలో ఈ చిత్రం విడుద‌ల కానున్నది.English summary
Kalyan Ram's MLA movie first look released on Tuesday. Kajal Agarwal is the heroine. Bharath Chowdary, Kiran Kumar Reddy are producers for the movie. This movie is slated to release in next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu