twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలం నుంచి త్రీడి చిత్రం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై త్రీడీ స్టీరియోఫోనిక్‌ విధానంలో 'ఓం' చిత్రాన్ని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు . శనివారం రాత్రి ఈ చిత్రం ఆడియో విడుదల ఘనంగా జరిగింది.

    ఈ చిత్రంతో ఛాయాగ్రాహకుడు సునీల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్ . అచ్చు, సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. 'ఓమ్‌' చిత్ర గీతాల విడుదల కార్యక్రమానికి దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

    ఈ కార్యక్రమంలో నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, శౌర్యారామ్‌, అచ్చు, సాయికార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఈ చిత్రం ఆడియో హైలెట్స్ ..స్లైడ్ షోలో ...

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    కల్యాణ్‌రామ్‌ కుమార్తె అద్విత తొలి సీడీని విడుదల చేసింది. దాసరి అందుకున్నారు.

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    తాత,మనవలు

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    తండ్రి ఆశీర్వాదం తీసుకుంటూ...

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    సినీ కుటుంబ పెద్ద దీవెనలు అందుకుంటూ...

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    ఆడియో లాంచింగ్ ముచ్చటగా ఇలా...

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    ఎక్కడ చూసినా కళ్యాణ్ రామ్...ఓం

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    శ్రేయాభిలాషుల సమక్షంలో...ఆనంద హేల

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    ''కల్యాణ్‌రామ్‌ ఒక త్రీడీ సినిమా చేయాలనుకున్నప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడలేదు. ఎక్కడెక్కడ అలాంటి గొప్పగొప్ప చిత్రాలు తీశారో తెలుసుకుని వారిని ఇక్కడికి రప్పించి సినిమా తీశాడు. ఎందుకంటే అతను నందమూరి వారసుడు'' అన్నారు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు.

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    అలాగే.. ''సినీ చరిత్రలో ఏ నటుడూ చేయని, చేయలేని పాత్రల్ని చేసిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. అందుకే వందేళ్ల సినీ చరిత్రలో ఆయనదే అగ్ర తాంబూలం. నేను ఎంతో మంది కళాకారులతో పని చేశాను. ప్రతి హీరో గురించి నాకు తెలుసు. కల్యాణ్‌రామ్‌ ఒక గొప్ప సినిమా చేయాలన్న తపనతో చేసిన చిత్రం ఓమ్‌. కథకి ఏది అవసరమో అది మాత్రమే తీశాడు. ఇలాంటి నాయకులు, నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరము''అన్నారు.

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    తాత,మనవరాళ్ల ముచ్చట్లే స్పెషల్ ఎట్రాక్షన్..

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    బిడ్డలిద్దరితో..కల్యాణ్ రామ్

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం నేను రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను. సాధారణంగా రెండున్నరేళ్లు ఒక నటుడు కనిపించకపోతే మన ఇండస్ట్రీలో వీడి పని అయిపోయింది అంటారు. కానీ నాకు ఆ భయం లేదు. మా అభిమానులు మంచి సినిమా తీస్తే ఎప్పుడైనా తప్పకుండా ఆదరిస్తారు. హాలీవుడ్‌లోనే త్రీడీ సినిమాలు చేయగలరా? మన ఆంధ్రులం తీయలేమా అన్న కసితో ఈ చిత్రాన్ని తీశాను. మా కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ నా వెంటే ఉంటారు. వెన్నెముక లేకపోతే నిలబడలేం. నా వెన్నెముక నా బావమరిది హరి. చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయబోతున్నాము''అన్నారు.

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    దర్శకుడు మాట్లాడుతూ ''నా మీద నమ్మకంతో ఇంత పెద్ద సినిమా నా చేతుల్లో పెట్టినందుకు కల్యాణ్‌రామ్‌కి కృతజ్ఞతలు''అన్నారు.

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    నటుడు చలపతిరావు మాట్లాడుతూ ''హరికృష్ణలో ఉన్న మొండితనం, ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ కలిపి పోతపోస్తే కల్యాణ్‌రామ్‌. కొత్తదనం కోసం నిరంతరం తపించే కథానాయకుడీయన'' అన్నారు.

     కళ్యాణ్ రామ్ 'ఓమ్‌' ఆడియో రిలీజ్ హైలెట్స్ (ఫోటోలు)

    అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్‌ అప్‌3, ఫైనల్‌ డెస్టినేషన్‌, స్పైడర్‌మేన్‌4, అవతార్‌, రెసిడెంట్‌ ఈవిల్‌ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్‌ ఎపిక్‌, త్రీడీ రిగ్‌ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్‌ చేశాం. గత ఏడు నెలలుగా అమెరికా, సింగపూర్‌ల్లో త్రీడీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి అని కళ్యాణ్ రామ్ చెప్పారు.

    English summary
    Kalyanram, Nikesha Patel, Kriti Karbanda starrer 'OM' directed by Sunil Reddy celebrated its audio launch in a grand manner on Saturday evening. Dasari Narayana Rao arrived as chief guest and said Kalyan Ram never depended on anyone while making the 3D film. He said he found out the greats in film making which brought him here to make the film. He said that shows the power of Nandamuri heroes.Kalyanram daughter Advita released the audio which is received by Dasari Narayana Rao. Kalyan Ram said he worked hard for 2 yrs for this film. Harikrishna, Ramakrishna, Sirivennela Seetarama Sastry, Sourya ram,Atchu, Sai Kartik graced the function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X