»   » ఫుల్ పటాస్: 'పటాస్' హీరో... టీం తో పార్టీ (ఫొటోలు)

ఫుల్ పటాస్: 'పటాస్' హీరో... టీం తో పార్టీ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్‌' చిత్రం హిట్టై మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత హిట్ అంటూ లేకుండా ఉన్న కళ్యాణ్ రామ్ కు ఊరటనిచ్చిన చిత్రం ఇది. దాంతో ఆయన, ఆయన టీమ్ చాలా జోష్ గా ఉన్నారు. ఆ జోష్ లో ఇదిగో ఈ క్రింద ఫొటోల మాదిరిగా పార్టీ చేసుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ పార్టీకు దర్శకుడు, హీరోతో పాటు సినిమాలో కీలకపాత్రలు పోషించిన శ్రీనివాస రెడ్డి, సాయికుమార్, సమీర్ వంటి వారు హాజరయ్యారు. ఈ పార్టీ ఓ రేంజిలో పీక్ లో జరిగిందని దర్శకుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో కామెంట్ చేసారు.


రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాక అతన్ని ఇండస్ట్రీలో హాట్ రైటర్ కమ్ డైరక్టర్ గా మార్చేసింది.


పార్టీ ఫొటోలు ఈ క్రింద చూడండి


మొదటినుంచీ

మొదటినుంచీ

కళ్యాణ్ రామ్ మొదటి నుంచి ఈ చిత్రం విజయంపై నమ్మకంగా ఉన్నారు.కలిసొచ్చింది

కలిసొచ్చింది

తెలిసిన కథే అయినా ఈ సినిమాకు కామెడీ బాగా కలిసొచ్చిందికొత్తగా

కొత్తగా

ఎప్పుడూ సీరియస్ రోల్స్ చేసే కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో ప్రేక్షకులకు కొత్తగా కనిపించారు.రచయితగా

రచయితగా

ఈ చిత్రానికి ముందే అనీల్ రావిపూడి దర్శకుడుగా సక్సెస్ అయ్యారు.అనీల్ రావి పూడి మాట్లాడుతూ...

అనీల్ రావి పూడి మాట్లాడుతూ...

''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. '' అన్నారు అనిల్‌ రావిపూడి.


ఆది స్పూర్తితోనే...

ఆది స్పూర్తితోనే...

వివి వినాయిక్ తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా అని చెప్పుకొచ్చారు.


కథ గురించి

కథ గురించి

''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది''దర్శకుడు గురించి...

దర్శకుడు గురించి...

''ఇంజినీరింగ్‌ అయ్యాక దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సహాయ దర్శకుడిగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేశారు.


రచయితగా గుర్తింపు

రచయితగా గుర్తింపు

'శంఖం', 'శౌర్యం', 'దరువు', 'కందిరీగ', 'అలా మొదలైంది', 'మసాలా', 'ఆగడు' తదితర చిత్రాలు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.


అప్పుడే..

అప్పుడే..

2012లో పక్కాగా మాస్‌ అంశాలతో కూడిన కథ రాసుకొని కల్యాణ్‌రామ్‌గారికి వినిపించాను. ఆయన అప్పుడు 'ఓం' చేస్తున్నారు. మొదట కథ విన్నాక 'చాలా బాగుంది. వేరే హీరోతో ఈ సినిమా నేను నిర్మిస్తా' అన్నారు.


కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ...

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ...

''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు.


హీరోయిన్ గురించి..

హీరోయిన్ గురించి..

శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది.శ్రీనివాస రెడ్డి

శ్రీనివాస రెడ్డి

ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి పాత్ర కీలకమే. ఆ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది.ఎవరెవరు

ఎవరెవరు

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.


English summary
Kalyan Ram's Pataas became a big hit in tollywood.
Please Wait while comments are loading...