For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ తర్వాత మోక్షజ్ఞ , అభయ్‌రామ్‌ రావొచ్చు ('షేర్‌' ఆడియో ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ''నందమూరి హీరోలంతా ఒక్కటే. తాతగారి తర్వాత బాబాయ్‌, ఆయన తర్వాత నాన్నగారు, ఆ తర్వాత నా తమ్ముడు మేమంతా ఓ పరంపరగా వస్తున్నాం. ఆ తర్వాత మోక్షజ్ఞ రావొచ్చు, అభయ్‌రామ్‌ రావొచ్చు, నా కొడుకూ రావొచ్చు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి''అన్నారు కళ్యాణ్ రామ్.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కల్యాణ్‌రామ్‌, సోనాల్‌ చౌహాన్‌ జంటగా నటించిన 'షేర్‌' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన పై విధంగా స్పందించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

  కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, కల్యాణ్‌రామ్‌, దిల్‌రాజు, మల్లికార్జున్‌, కౌమారం వెంకటేశ్‌, బ్రహ్మానందం, సోనాల్‌ చౌహాన్‌, ప్రియ, సి.కల్యాణ్‌, దామోదర్‌ ప్రసాద్‌, తమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మల్లికార్జున దర్శకత్వం వహిస్తుండగా.. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

  ''మేమంతా నందమూరి తారక రామారావు అనే మహావృక్షం నుంచి వచ్చినవాళ్లం. మేమెప్పుడూ వేరు కాదు. మమ్మల్ని ఎవరూ వేరు చేసి మాట్లాడొద్దు. నేను సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ విలువిస్తా. ఎన్టీఆరే మా బలం, మా స్ఫూర్తి'' అన్నారు కల్యాణ్‌రామ్‌.

  ఆడియో పంక్షన్ విశేషాలు..ఫొటోలు స్లైడ్ షోలో ...

  పాటల సీడిలను..

  పాటల సీడిలను..

  పాటల సీడీలను హీరో ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు.

  ట్రైలర్ ఆవిష్కరణ

  ట్రైలర్ ఆవిష్కరణ

  ప్రచార చిత్రాన్ని పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.

  ఎన్టీఆర్‌ మాట్లాడుతూ...

  ఎన్టీఆర్‌ మాట్లాడుతూ...

  ''మల్లికార్జున్‌తో కల్యాణ్‌రామ్‌ అన్నయ్య చేస్తున్న మూడో సినిమా ఇది. మనం ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత ప్రభావం చూపించామన్నది ముఖ్యం. ఆ ప్రభావం ఈ సినిమా తీసుకురావాలని కోరుకొంటున్నా. తమన్‌ సృజనాత్మకంగా ఆలోచించి సంగీతం ఇస్తాడు. ఈ సినిమా పాటలు బాగున్నాయి. సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకొంటున్నా .అన్న ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఇంతే నిజాయతీగా ఉండాలి. ఆయనకు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి''అన్నారు.

  జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ...

  జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ...

  -'' 'నాన్నకు ప్రేమతో' షూటింగ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని అందరినీ చూసి వెళిపోదామని లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేనేదో 'కిక్-2' గురించి సంతకాలు పెట్టడానికి వచ్చానని వార్తలు వచ్చాయి. కల్యాణ్‌రామ్ అన్నయ్యది ఒకరికి పెట్టే చేయే కానీ తీసుకునే చేయి కాదు. అంత మంచి వ్యక్తి ఆయన. కల్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇది మంచి సినిమాగా నిలిచిపోవాలి'' అని ఆకాంక్షించారు.

  కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ...

  కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ...

  ''మల్లితో మూడో సినిమా ఎందుకు చేస్తున్నావని చాలామంది ప్రశ్నించారు. నేను కథను నమ్ముతాను. కొంతమందికి సమయం కలిసిరాక అనుకొన్నవి జరగవు. ఈసారి మల్లికార్జున్‌ తప్పకుండా విజయం సాధిస్తాడు. ఈ సినిమా నా కోసం కాదు, మల్లి కోసం విజయం సాధించాలి. మల్లి లాంటి మంచి దర్శకుడు నిలబడాలి. జీవితంలో అందరికీ జయాపజయాలు వస్తాయి. నాకు రాలేదా? విజయం వస్తే అన్నీ మరిచిపోతాం. ''అన్నారు.

  కల్యాణ్‌రామ్ కంటిన్యూ చేస్తూ...

  కల్యాణ్‌రామ్ కంటిన్యూ చేస్తూ...

  ''సినిమా ఆలస్యమైనా నిర్మాత వెంకటేశ్‌గారు ఓపిగ్గా భరించారు. నా వల్ల ఆలస్యమైతే గనక ఆయనకు నా క్షమాపణలు. '' అన్నారు.

  కుటుంబం ముఖ్యం..

  కుటుంబం ముఖ్యం..

  కళ్యాణ్ రామ్ చెప్తూ... ఈ మధ్య అందరూ మమ్మల్ని విడదీసి మాట్లాడుతున్నారు. మాది ఒక వంశం. మేమందరం ఒకటే. దయచేసి మమ్మల్ని వేరు చేసి మాట్లాడద్దు. నా కుటుంబమే నాకు ముఖ్యం అని చెప్పుకొచ్చారు.

  దర్శకుడు మాట్లాడుతూ...

  దర్శకుడు మాట్లాడుతూ...

  ''తమన్‌ మంచి పాటలిచ్చాడు. నేపథ్య సంగీతమూ ఆకట్టుకుంది. కల్యాణ్‌రామ్‌తో నాది 12 ఏళ్ల ప్రయాణం. తన నమ్మకమే ఈ సినిమా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన''న్నారు. తమన్‌ మాట్లాడుతూ ''వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. సర్వేష్‌ మురారి కెమెరా పనితనం సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది''అన్నారు.

  నిర్మాత మాట్లాడుతూ...

  నిర్మాత మాట్లాడుతూ...

  నా తొలి సినిమానే నందమూరి హీరో తో చేయడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత.

  హీరోయిన్ సోనాల్‌ మాట్లాడుతూ...

  హీరోయిన్ సోనాల్‌ మాట్లాడుతూ...

  ''నా సినీ ప్రయాణానికి 'లెజెండ్‌'ఓ మలుపు. ఆ తర్వాత మరోసారి నందమూరి హీరోతో నటించడం ఆనందంగా ఉంది''అన్నారు.

  ఎన్టీఆర్ తో రెడీ..

  ఎన్టీఆర్ తో రెడీ..

  సోనాల్ చౌహాన్ కంటిన్యూ చేస్తూ..- అవకాశమొస్తే జూ.ఎన్టీఆర్‌తో కూడా యాక్ట్ చేయడానికి రెడీ'' అని అన్నారు.

  దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ-

  దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ-

  '' కల్యాణ్‌రామ్‌గారు 'పటాస్' టైంలో నన్ను బాగా ప్రోత్సహించారు. నేను రెండో సినిమా ప్రారంభించిన సమయంలో అందరికన్నా ముందు నాకు కల్యాణ్‌రామ్‌గారు ఫోన్ చేసి 'నీ రెండో సినిమా మంచి విజయం సాధించాలి' అన్నారు. ఆయన ఎంతో మంచి మనిషి. 'పటాస్' సినిమా కన్నా ఈ సినిమా పదిరెట్లు విజయం సాధించాలి'' అని ఆకాంక్షించారు.

  దిల్‌ రాజు మాట్లాడుతూ ...

  దిల్‌ రాజు మాట్లాడుతూ ...

  ''ఈ ఏడాది నిజాయతీగా విజయం సాధించిన చిత్రాల్లో 'పటాస్‌' ఒకటి. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేశారు కల్యాణ్‌రామ్‌. ఎప్పుడు కనిపించినా ఈ సినిమా గురించే మాట్లాడేవాడు. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. తన కోసం ఈ సినిమా విజయవంతం కావాలి''అన్నారు.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, దామోదర్‌ప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, వక్కంతం వంశీ, శ్రీమణి, కందికొండ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

  English summary
  The audio album of Nandamuri Kalyanram’s soon to be released mass entertainer, Sher, was released by NTR in Hyderabad last night. The audio album, composed by SS Thaman, already became a huge success among the Nandamuri fans and it created a positive buzz for the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X