»   » వేటకు దిగితే.... ('షేర్‌' ప్రివ్యూ)

వేటకు దిగితే.... ('షేర్‌' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: లాంగ్ గ్యాప్ తర్వాత 'పటాస్' సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాతో మళ్లీ ఎనర్జీ గెయిన్ చేసిన ఈ నందమూరి ఫ్యామిలీ హీరో.. రవితేజతో కిక్-2 సినిమాను ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం షేర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు దర్శక,నిర్మాతలు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుదర్శకుడు మాట్లాడుతూ ''కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌' తర్వాత నటించిన చిత్రమిది. నందమూరి అభిమానులు పండగ చేసుకొనేలా తెరపై విజృంభించి నటించారు. హిందీలో షేర్‌ అంటే సింహం అని అర్థం. సినిమాలో కల్యాణ్‌రామ్‌ పాత్ర అదే తరహాలో ఉంటుంది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది'' అన్నారు.


దర్శకుడు మల్లి కంటిన్యూ చేస్తూ...... 'కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'షేర్‌' ఒక సంచలనాత్మకమైన చిత్రమవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ విజృంభించి నటించారు' అని దర్శకుడు మల్లికార్జున్‌ తెలిపారు.


నిర్మాత మాట్లాడుతూ...''కల్యాణ్‌రామ్‌ను ఓ సరికొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. డైమండ్‌ రత్నం కథ, మాటలు బాగున్నాయి. తమన్‌ వినసొంపైన బాణీల్ని అందించారు '' అన్నారు నిర్మాత.


Kalyan Ram's Sher preview

నటీనటులు:నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ , బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు
కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు,
సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌.,
సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి,
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు,
ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌,
ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌,
స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌,
ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి,
మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌,
మేకప్‌: మోహనరావు,
కాస్ట్యూమ్స్‌: శ్రీను,
పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే,
ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ,
కోడైరెక్టర్‌: శేషు బలగ,
లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌,
సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌,
నిర్మాత: కొమర వెంకటేష్‌,
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.
విడుదల తేదీ: 30, అక్టోబర్ 2015.

English summary
Kalyan Ram’s latest Telugu action entertainermovie “Sher” released worldwide on 30th October, 2015 (Friday). The film is directed by Mallikarjuna and produced by Komara Venkatesh. While the “Sher” movie is written by Diamond Ratna Babu. The movie starring Kalyan Ram and Sonal Chauhan in lead roles while Vikramjeet Virk plays other important role in this movie. The film music is composed by S. Thaman, while Cinematography was handled by Sarvesh Murari.
Please Wait while comments are loading...