»   » కల్యాణ్‌రామ్‌ 'షేర్‌': స్టోరీ కాన్సెప్ట్ ఇదే...

కల్యాణ్‌రామ్‌ 'షేర్‌': స్టోరీ కాన్సెప్ట్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం 'షేర్‌'. సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్ . మల్లికార్జున్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కొమర వెంకటేష్‌ నిర్మాత. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం కాన్సెప్టు గురించి కళ్యాణ్ రామ్ చెప్తూ... సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌.

దర్శకుడు మాట్లాడుతూ ''కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌' తర్వాత నటించిన చిత్రమిది. నందమూరి అభిమానులు పండగ చేసుకొనేలా తెరపై విజృంభించి నటించారు. హిందీలో షేర్‌ అంటే సింహం అని అర్థం. సినిమాలో కల్యాణ్‌రామ్‌ పాత్ర అదే తరహాలో ఉంటుంది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది'' అన్నారు.

Kalyan Ram’s Sher to release in October

దర్శకుడు మల్లి కంటిన్యూ చేస్తూ...... 'కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'షేర్‌' ఒక సంచలనాత్మకమైన చిత్రమవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ విజృంభించి నటించారు' అని దర్శకుడు మల్లికార్జున్‌ తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...''కల్యాణ్‌రామ్‌ను ఓ సరికొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. డైమండ్‌ రత్నం కథ, మాటలు బాగున్నాయి. తమన్‌ వినసొంపైన బాణీల్ని అందించారు. నెలాఖరున పాటల్ని విడుదల చేస్తాం. వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు నిర్మాత.

బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, సాయాజీ షిండే, అలీ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Nandamuri Kalyan Ram's Sher shooting finished. . And the latest we hear is that the makers have decided to release the film in the second week of October. Directed by Mallikarjun, this movie features Sonal Chauhan as the female lead. Brahmanandam and Ravu Ramesh are also playing crucial roles in this film. SS Thaman is scoring tunes and Komar Venkatesh is the producer.
Please Wait while comments are loading...