»   » ఫ్యాన్స్‌‌ని కూల్ చేయడంలో కళ్యాణ్ రామ్- నాగబాబు మధ్య తేడా!

ఫ్యాన్స్‌‌ని కూల్ చేయడంలో కళ్యాణ్ రామ్- నాగబాబు మధ్య తేడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల జరిగిన ‘షేర్' ఆడియో వేడుకలో కళ్యాణ్ రామ్ అభిమానులను డీల్ చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆడియో వేడుక జరుగుతుండగా కొందరు నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ గోల చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలివిగా స్పందించిన కళ్యాన్ రామ్...మేమంతా ఎన్టీఆర్ వారసులమే, తమను వేరు చేసి మాట్లాడవద్దని ఫంక్షన్ కు హాజరైన అభిమానులను కోరాడు. తామంతా ఎప్పటికైనా ఒకటే, అభిమానులు కూడా ఒకటే అంటూ ఫ్యాన్స్ ను కూల్ చేశాడు.

గత కొన్ని రోజుల క్రితం... చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేసారు. దీంతో నాగబాబు కోపం కట్టలు తెంచుకుంది. అభిమానులపై మండి పడ్డారు. అప్పుడు నాగబాబు తీరుతో కొందరు ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆ సమయంలో నాగబాబు సహనంగా ఉండటంలో, అభిమానులను కూల్ చేయడంలో విఫలం అయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి.

Kalyan Ram's soft dealing in talk

కళ్యాణ్ రామ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. అభిమానుల విలువ ఏమిటో తెలిసిన వ్యక్తి. అందుకే ఆయన ఆ రోజు వ్యవహారాన్ని చాలా కూల్ గా డీల్ చేసాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అభిమానుల అండ ఉంటేనే తామ కెరీర్లో ఎదుగుతామని కళ్యాణ్ రామ్ బలంగా నమ్ముతారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

కళ్యాణ్ రామ్ షేర్ మూవీ విశేషాలు...
శడైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

English summary
Mega Hero Naga Babu slammed the Power Star Pawan Kalyan fans on Mega Star's Birthday and now recently hero Nandamuri Kalyan Ram appealed to the fans in Sher Audio launch that not to see anyone from this family separately.
Please Wait while comments are loading...