For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  15 ఏళ్ల వరకు నాన్నతో నాకు పరిచయం లేదు, తాతగారి సేవలోనే గడిపారు: కళ్యాణ్ రామ్ ఎమోషనల్ స్పీచ్

  |

  మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  ఎన్..టి..ఆర్ ఆయన గురించి మాట్లాడే వయసు, అర్హత నాకు లేదు. ఆయన గురించి ఎందరో పెద్దలు గొప్ప విషయాలు మాట్లాడారు. కానీ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది 'మనం ఇచ్చిన కమిట్టమెంటుకు న్యాయం చేయాలి, డెడికేషన్‌తో సినిమా చేయాలి' అనే విషయాలు అని కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించారు.

  తాత ఎన్నో మంచి పనులు చేశారు

  తాత ఎన్నో మంచి పనులు చేశారు

  ఆయన్ను ఇండియన్ సూపర్ స్టార్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఏదో చేయాలనే తపనతో ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారికి ఏదో చేయాలి, వారి రుణం తీర్చుకోవాలని... సేవతో పాటు చాలా కార్యక్రమాలు చేశాడు. ఆడవారికి ఆస్తిలో సమానహక్కు ఇచ్చారు, రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు.

  ఇది కేవలం బాబాయ్ ఒక్కరి వల్లే అవుతుంది

  ఇది కేవలం బాబాయ్ ఒక్కరి వల్లే అవుతుంది

  ఆయన యుగ పురుషుడు. అలాంటి వ్యక్తిపై సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా తీయడం బాబాయ్ ఒక్కరి వల్లే అవుతుంది. ఎవరి వల్ల కాదు. దీన్ని తీయాలంటే చాలా బాధ్యత, ఆయన పట్ల విపరీతమైన గౌరవం ఉండాలి. అన్నీ సమకూర్చుకుని ఒక అద్భుతమైన వ్యాల్యూస్‌తో ఈ సినిమా చేయాలి. అందుకే బాబాయ్ ఎన్‌బికె ఫిల్మ్స్ స్థాపించారు. ఇది నందమూరి కుటుంబ సభ్యుల బేనర్ అని అన్నారు.

  ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటానా?

  ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటానా?

  సినిమా మొదలైన తర్వాత బాబాయ్ ఫోన్ చేసి.... మీ నాన్నగారి పాత్ర నువ్వు చేయాలి. ఒకసారి ఆలోచిస్తావా? అన్నారు. జీవితంలో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? వెంటనే ఓకే చెప్పాను. నా సినిమా జీవితం మొదలు పెట్టిందే బాబాయ్. బాలగోపాలుడు సినిమాతో సరిగ్గా 30 ఏళ్ల క్రితం... బాబాయ్ గారి ‘ప్రియదర్శిని బ్రహ్మిణి ఆర్ట్స్‌'లో నా నట జీవితం మొదలు పెట్టి 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన బేనర్లో సినిమా చేసే అవకాశం వస్తే ఆలోచిస్తామా? చేస్తాను అని చెప్పేశాను.

  నాన్నగారిలా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు

  నేను ఏనాడు మా నాన్నగారి లాగా ఉంటానని అనుకోలేదు. మేము సన్నగా ఉంటాం. ఆయన టైగర్‌లాగా దిట్టంగా ఉంటారు. చాలా గెటప్ టెస్టులు జరిగిన తర్వాత... బాబాయ్ ఫోన్ చేసి అదిరిపోయావ్ అన్నారు. అచ్చు మా అన్నను చూసినట్లే ఉంది. ఆయన 25వ ఏట ఎలా ఉన్నారో అలాగే ఉన్నావు అన్నారు. అప్పుడు నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.

  15వ ఏటనే నాకు నాన్నతో పరిచయం అయింది, ఆయన జీవితం తాతగారి సేవలోనే

  15వ ఏటనే నాకు నాన్నతో పరిచయం అయింది, ఆయన జీవితం తాతగారి సేవలోనే

  మా నాన్నగారితో పరిచయం నాకు 15వ ఏట జరిగింది. ఎందుకంటే తాతగారితోనే ఆయన జీవితం సాగిపోయింది. 45 ఏళ్ల వరకు తాతగారి సేవలోనే బ్రతికేశారు. నాన్న... నాన్న... అనే పదంతో బ్రతికేశారు. నాకెప్పుడూ ఉదయం లేచెసరికి నాన్న కనిపించేవారు కాదు. ఎందుకంటే తాతగారు 3 గంటలకు లేస్తారు. ఈయన మూడున్నకు అక్కడ ఉండేవారు. మేము అపుడు 5 గంటలకు లేచేవారం కాదు. రాత్రి 8 గంటలకు పడుకుంటే నాన్నగారు రాత్రి 10 గంటలకు వచ్చేవారు. ఆందుకే ఆయనతో పెద్దగా సాన్నిహిత్యం లేదు.

  మీ నాన్న ఏరోజూ ఎవరికీ భయపడలేదు అన్నారు

  మీ నాన్న ఏరోజూ ఎవరికీ భయపడలేదు అన్నారు

  నాన్న నాకు 15 ఏట నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ఆయన పాత్ర పోషించేపుడు ఎలా చేయాలో తెలియదు. బాబాయ్ గారు ప్రతి డైలాగ్ ఎలా చేయాలో చెప్పేవారు. మీ నాన్న ఏరోజూ ఎవరికీ భయపడలేదు. మీ తాతగారి దగ్గర కూడా నిర్మొహమాటంగా ఉండేవారు. ఏదైనా ముక్కుసూటితనం ఉండేది... అలాగే నటించు అని ప్రోత్సహించారని కళ్యాణ్ రామ్ తెలిపారు.

  English summary
  Kalyan Ram Speech at NTR Biopic Audio Launch. The audio and trailer launch event of ‘NTR’ biopic is held on December 21st at JRC Convention in Filmnagar, Hyderabad. Starring Nandamuri Balakrishna, Vidya Balan in the lead roles, the film is being directed by Krish Jagarlamudi. MM Keeravani has composed music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X