For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను రాజకీయాల్లోకి రాకూడదా? : కళ్యాణ్‌రామ్‌

  By Srikanya
  |

  చిత్తూరు టౌన్ : మంచి నటుడిగా ఎదగడానికి కృషి చేస్తున్న తాను అవసరం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రముఖ సినీ నటుడు కళ్యాణ్ రామ్ తెలిపారు. చిత్తూరు లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ సందడి చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పూనేపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆదివారం ఆయన చిత్తూరుకు వచ్చారు. ఈ సందర్భంగా భాస్కర హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మీడియాతో మాట్లాడారు. అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. అందరితోనూ ఫొటోలు దిగారు.

  ఆ సమయంలో మీడియా వారు మీరు రాజకీయాల్లోకి వస్తారా..? అన్న ప్రశ్నకు ఆయన వెంటనే సమాధానమిచ్చారు. ప్రతిచోట మీడియా మిత్రులు ఇదే ప్రశ్న వేస్తున్నారని.. 'తాను రాజకీయాల్లోకి రాకూడదనేమైనా ఉందా.. అంటూ ఎదురుప్రశ్న వేశారు'. తమది రాజకీయ వంశమని, తన తాత స్థాపించిన పార్టీలోకి ఎప్పుడైనా రావడానికి సిద్ధమేనని అన్నారు. గతంలో ఎన్నికల కోసం గన్నవరంలో ప్రచారం కూడా చేశాను. వచ్చే ఎన్ని క అవసరమైతే కచ్చితంగా ప్రచారం చేస్తానని తెలిపారు.

  తాను ఎక్కడ పర్యటించినా రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నిస్తున్నారని... అసలు తాను పుట్టిందే రాజకీయ కుటుంబం నుంచి అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.తన తాత నందమూరి తారకరామారావు తెలుగు సినీ పరిశ్రమలో,రాజకీయ రంగంలో మకుటంలేని మహారాజుగా పేరుతెచ్చుకున్నారన్నారు. అవసరం వచ్చినప్పుడు తాను కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్నారు. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన తాను, 2014 ఎన్నికల్లో కూడా మామయ్య చంద్రబాబు కోసం ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం కోసం పాదయాత్రలు నిర్వహిస్తున్న చంద్రబాబును కాంగ్రెస్, వైసీపీలు రాజకీయ లబ్ధికోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించడం భావ్యం కాదన్నారు.

  ప్రస్తుతం తనకు సినిమా, కెరీర్‌ ముఖ్యమని వాటిపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. తాను నటించిన 'ఓం' అనే 3డీ తెలుగు చిత్రం మే లోగా విడుదల అవుతుందని, ఆ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఇటీవల మంచి కథలు దొరకనందునే సినిమాల్లో నటించలేకపోయానన్నారు.ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో 'ఓం' అనే 3డి సినిమాలో నటిస్తున్నానని,మార్చి నెలాఖరులో దీన్ని విడుదల చేస్తామన్నారు.ప్రస్తుతం కొత్త నటీనటుల కోసం సినీ పరిశమ్ర ఎదురు చూస్తోందన్నారు.

  అలాగే చిత్తూరులో నందమూరి అభిమానులు అధికంగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు పాదయాత్రపై ప్రశ్నించగా.. మామయ్య 60 ఏళ్లపైబడిన వయసులో ప్రజల కోసం పాదయాత్ర చేయడం మంచిపనేనని, ప్రజల నుంచి మంచి ఆదరాభిమానాలు వస్తున్నాయని అన్నారు. .కాగా కళ్యాణ్‌రామ్‌ను పలువురు టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు.టీడీపీ నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్, కార్యదర్శి విల్వనాధన్, మోహన్ రాజ్, లోకేష్, మురుగన్, నీరజాక్షులు నాయుడు, కుమార్, కిరణ్, తిరుపతికి చెందిన మనోహర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, లోకేష్ చౌదరి, అనిల్, పృధ్వి, పూతలపట్టు నియోజకవర్గ నేత ఎన్.పి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  Hero Nandamuri Kalyan Ram said on Sunday that he is ready to enter poltics any time. And also said...YSR Congress Party is saying lies on Telugudesam Party.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X