»   » ‘కళ్యాణ వైభోగమే’ సెన్సార్ రిపోర్ట్

‘కళ్యాణ వైభోగమే’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే'. నందినిరెడ్డి దర్శకురాలు. రంజిత మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ కోడూరి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి క్లీన్ ‘యూ' స్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రం సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సార్‌ బోర్డు నుంచి 'క్లీన్‌-యూ' సర్టిఫికెట్‌ పొందినట్లు సంగీత దర్శకుడు కల్యాణ్‌ కోడూరి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. పిల్లలు, పెద్దలు ఇలా అన్ని వయసుల వారు చూడదగ్గ సినిమాగా సర్టిఫికెట్ రావడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రన్ని జనవరి 22 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్థమయ్యేలా కామెడీ, సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కథా చిత్రం "కళ్యాణ వైభోగమే".


'Kalyana Vaibhogame' censor report

చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవలే విడుదలైంది. పాటలను మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకప్పటి అందాల నటి రాశి ఈ చిత్రంలో మాళిక నాయర్ తల్లి పాత్రలో నటిస్తున్నారు.


నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్ (ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం), రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తాగుబోతు రమేష్, ధనరాజ్, 'మిర్చి' హేమంత్, స్నిగ్ధ తదితరులు, సాంకేతిక నిపుణులు : సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జి.వి. ఎస్. రాజు, ఎడిటర్ : జునైద్ సిద్దిక్, కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్, రఘు, అని యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ, వైశాలి డైలాగ్స్ & లిరిక్స్: లక్ష్మీ భూపాల్ కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి . వి ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి.

English summary
Nandini Reddy's Kalyana Vaibhogame is done with censor formalities. The film has been certified a clean U. The film stars Naga Shourya and Malavika Nair as the lead pair. Music is by Kalyan Koduri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu