నాగ శౌర్య ‘కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్ (సెల్ఫీ)

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ".

నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది .

ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే "

Kalyana Vaibhogame first look poster

షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఉంది . చిత్ర నిర్మాతలు త్వరలో ఆడియో ను డిసెంబర్ లో సినిమా ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు.

నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు నటించారు. సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ : జి . వి . ఎస్ . రాజు, ఎడిటర్ : జునైద్ సిద్దిక్, కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని, యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి, డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్, కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి, ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్, స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X