»   » సరస్వతీ దేవిగా ప్రత్యక్షమవబోతున్న కళ్యాణి!

సరస్వతీ దేవిగా ప్రత్యక్షమవబోతున్న కళ్యాణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో పదహారణాల ఆడపడుచులా అనిపించే తార ఎవరయ్యా..అంటే వెంటనే కళ్యాణి అని చెప్తారు..ఆమె నడిచేతీరు, వేషదారణ చూసిన వారు ఎవరైనా సరే ఆమె మలయాళ భామ అని అనుకోరు. మన తెలుగు అమ్మాయిలు మన కల్చర్ ని పాడుచేస్తోంటే మిగతా వారు మాత్రం మన కల్చర్ అంటే ఇష్టపడటం అలానే ఉండాలని కోరుకోవడం చూస్తుంటే మనవాళ్లను చూసి సిగ్గు పడుతున్నా ఇటువంటి వారిని చూసి మాత్రం గర్వపడుతుంటాం.

'శేషు" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై 'ఔను వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు" చిత్రంతో మంచి తారగా గుర్తింపు తెచ్చుకుని దర్శకుడు సూర్యకిరణ్ ను పెళ్లి చేసుకున్న కళ్యాణి, తర్వాత సినిమాలను చేయడం కూడా తగ్గించుకుంది. ఈ మధ్యనే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో లక్ష్యం, రక్ష, ఆపదమొక్కులవాడు వంటి చిత్రాలో నటించిన కళ్యాణి, వాటిలో కూడా తన సహజ నటనను ప్రదర్శించింది.

ప్రస్తుతం ఓ పౌరాణిక చిత్రంలో ఆమెకు ఓ అపురూపమైన పాత్ర లభించింది. తెలుగింటి అమ్మాయిలానే కాదు..చదువుల తల్లి సరస్వతీ దేవిగా కూడా మెప్పిస్తానంటూ లక్కీ మీడియా బ్యానర్ పై గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్(గోపి)నిర్మిస్తున్న 'బ్రహ్మలోకం టూ యమలోకం" చిత్రం లో సరస్వతీ దేవిగా కనిపించనుందని సమాచారం. ఇంకా ఈ చిత్రంలో డా రాజేంద్ర ప్రసాద్, శివాజీ కథానాయకులుగా, వినాయకుడు చిత్ర హీరోయిన్ సోనియా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఆర్తీ అగర్వాల్ రంభగా కనిపించనుందని వార్తలు వచ్చాయి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu