»   » కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్-వక్కతం వంశీ చిత్రం

కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్-వక్కతం వంశీ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల తన సొంత బేనర్లో హీరోగా చేసిన ‘పటాస్' చిత్రం మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత హిట్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. తముడు ఎన్టీఆర్ తో కూడా తన రిలేషన్ షిప్ క్లోజ్ అవ్వడం కూడా కళ్యాణ్ రామ్ ఆనందానికి మరో కారణం. ఈ క్రమంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు సిద్దమవుతున్నాడు.

ఫిల్మ్ నగటర్ సమాచారం ప్రకారం...కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్రానికి వక్కతం వంశీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వంశీ ఎన్టీఆర్ కి స్క్రిప్టు చెప్పడం, ఎన్టీఆర్ ఓకే చెప్పడం తెలిసిందే. ప్రస్తుతం వంశీ స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. దర్శకుడిగా తన తొలి సినిమా కావడంతో వక్కతం వంశీ చాలా కేర్ ఫుల్ గా వర్క్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Kalyanram to produce NTR film

నందూమరి బ్రదర్స్ కాంబినేషన్లో సినిమా వస్తే.... వసూళ్ల పరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే తాటిపైకి రావడం అభిమానుల్లో ఆనందం నింపుతోంది. మరో వైపు బాబాయ్ నందమూరి బాలయ్యతో కూడా కళ్యాణ్ రామ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

2015 సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అంటూ ‘పటాస్' సినిమా మొదలైనప్పటి నుండి చెబుదున్నారు. చెప్పినట్లుగానే ‘పటాస్' హిట్టయింది. ‘టెంపర్' విజయంతో ఈ వాదన మరింత బలపడింది. రాబోయే బాలయ్య సినిమా ‘లయన్' కూడా హిట్టయితే ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అనే మాట పరిపూర్ణమవుతుంది.

English summary
According to the latest buzz, Kalyanram may produce his brother NTR’s film under Vakkantham Vamsi’s direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu