»   » నోటిదూల: నిన్న పవన్ కళ్యాణ్ మీద... ఇప్పుడు అల్లు అర్జున్ మీద!

నోటిదూల: నిన్న పవన్ కళ్యాణ్ మీద... ఇప్పుడు అల్లు అర్జున్ మీద!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నోటిదూల ప్రదర్శించిన బాలీవుడ్ క్రిటిక్ కమాల్ రషీద్ ఖాన్... ఆ తర్వాత బాహుబలి స్టార్స్ ప్రభాస్, దగ్గుబాటి రానా మీద కూడా తన దురహంకార వ్యాఖ్యలతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు సినిమా అభిమానులు అతగాడిని ట్విట్టర్లో ఓ ఆట ఆడుకున్నారనుకోండి...అది వేరేసంగతి.

ఎప్పుడూ ట్విట్టర్లో ప్రముఖులపై ఏవో కారు కూతలు కూయడం, వారి అభిమానులతో తిట్లు తినడానికి అలవాటు పడ్డ కమాల్ రషీద్ ఖాన్ తాజాగా అల్లు అర్జున్ మీద కామెంట్స్ చేసి బన్నీ అభిమానుల మాటల దాడిలో చిత్తయ్యాడు. ఇంతకీ అతగాడికి బన్నిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటి అనేది ఓ సారి చూద్దాం.

ఆ యాడ్ కారణంగానే..

ఆ యాడ్ కారణంగానే..

అల్లు అర్జున్ ఫెయిర్ అండ్ హాండ్సమ్ అనే మెన్స్ ఫెయినెస్ క్రీమ్‌కు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లుక్ గురించి కాంట్రవర్సల్ కామెంట్ చేశాడు.

ఈ ఆలూ మొహం అంటూ..

ఈ ఆలూ మొహం అంటూ..

ఈ రోజు నాకు ఎవరో చెప్పారూ... ఈ లుక్కా లుకింగ్ ఆలూ తెలుగులో పెద్ద స్టార్ అని. బ్రో నీవు ఏమైనా చిన్న రోల్స్ చేయాలనుకుంటే బాలీవుడ్‌కి రా....అంటూ బన్నీని కించపరుస్తూ ట్వీట్ చేశాడు.

అట్టుడికిన మెగా అభిమానులు

కమాల్ రషీద్ ఖాన్ చేసిన కామెంట్లతో మెగా అభిమానలోకం ఆగ్రహంతో అట్టుడికి పోయింది. ట్విట్టర్లో తమ కామెంట్లతో కమాల్ రషీద్ మీద విమర్శల దాడి చేశారు.

ఎప్పుడూ వివాదాల్లోనే...

సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ.... పబ్లిసిటీ కోసం వెంపర్లాడే కమాల్ రషీద్.... కొన్ని రోజుల క్రితం రాఖీ సావంత్ మీద కూడా సంచలన కామెంట్స్ చేశాడు. ఆమెకు మగాళ్లతో అవసరం లేదని, ఆమె ఓ లెస్పియన్ అంటూ ట్వీట్ చేశాడు.

English summary
”Today someone told me that this Lukkha looking Aaloo is big star of Telugu. Bro you come to Bollywood if you want to do small small roles." Kamaal R Khan tweeted about Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu