»   » నా తల్లి విషం పెట్టి చంపాలని చూసింది.. మదర్స్ డే రోజున ప్రముఖ హీరో ట్వీట్..

నా తల్లి విషం పెట్టి చంపాలని చూసింది.. మదర్స్ డే రోజున ప్రముఖ హీరో ట్వీట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మదర్స్ డే రోజున తల్లి చూపే అనురాగాన్ని, ఆప్యాయత, ప్రేమను గొప్పగా చెప్పుకొంటారు. కానీ ఎప్పడూ వివాదాస్పద ట్వీట్లతో అందర్ని తిట్టిపోసే బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే మాత్రం తన తల్లి తనకు విషం పెట్టి చంపాలని చూసిందని ట్విట్టర్‌లో బాంబు పేల్చాడు. తాజాగా కేఆర్కే చేసిన వరుస ట్వీట్లు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

ఇప్పుడు నా తల్లి గర్వపడుతుంటుంది.

మదర్స్ డే పురస్కరించుకొని తన తల్లి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. విష్ యూ వెరీ హ్యాప్పీ మదర్స్ డే అమ్మ.. ఒకప్పుడు నీవు నాకు విషం పెట్టి చంపాలని చూశావు. కానీ ఇప్పడు నన్ను చూసి కచ్చితంగా గర్వపడుతుంటావు అని ట్వీట్ చేశాడు.

అప్పుడు విషంపెట్టి చంపాలని చూసింది..

నేను పిచ్చిగా సినిమాలు చూడటంపై నా తల్లికి నాపై కోపం ఉండేది. కుటుంబ ప్రతిష్ఠను వీడు మంటకలుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో నాకు విషం ఇచ్చి చంపాలని చూసింది అని మరో ట్వీట్ చేశాడు.

నేను చెడ్డవాడిననే..

నా తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. అందులో ఒకడి నేను. అందర్నిలో నేనే చెడ్డవాడిననే అభిప్రాయం వారికి ఉండేది. వ్యవసాయం చేయకుండా స్కూల్‌కు వెళ్లడం, స్నేహితులతో సినిమాలు చూడటం వారికి కోపంగా ఉండేది అని ట్వీట్ చేశాడు..

స్కూల్ వెళ్లకుండా..

నేను స్కూల్‌కు వెళ్లకుండా 15 ఏటనే నా కజిన్ సిస్టర్‌ను పెళ్లి చేసుకొని ఉంటే నా అంత మంచి కొడుకు ఉండేవాడు కాదని నా తల్లి అనుకుని ఉండేదేమో.. ఎందుకంటే నేను వ్యవసాయం పనులు బాగా చేసేవాడిని కాబట్టి.. అని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

12 ఏళ్లకే పెళ్లి..

నా తల్లిదండ్రుల దృష్టిలో నా సోదరులు చాలా మంచివారు. ఎందుకంటే స్కూల్‌కు వెళ్లకుండా బుద్ధిగా వ్యవసాయం పనులు చేసేవారు. అంతేకాకుండా నా సోదరులు అందరూ 12 ఏళ్లకే పెళ్లి చేసుకొన్నారు. నాతండ్రి మాదిరిగానే మంచి రైతులుగా పేరు తెచ్చుకొన్నారు అని మరో ట్వీట్ వెల్లడించారు.

సూపర్ స్టార్‌ను కావాలని..

సూపర్ స్టార్‌ను కావాలని..

రూర్కీలో కాలేజీ విద్యను పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఆశలు పెంచుకొని బాంబేకు పారిపోయాను. సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కావాలనే కల ఉండేది. ఆ కలను కనడం వల్లనే ఇప్పుడు మీరు కేఆర్కేను ఇలా చూస్తున్నారు అని కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసి తన జీవితంలో కీలక విషయాలను వెల్లడించారు.

English summary
It's Mother's Day and Kamaal Rashid Khan aka KRK, the self-proclaimed film critic and Twitter influencer had a very interesting story to share about his mother. Turns out the lady wanted to poison him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu