అది మేమిద్దరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం: కమల్

అలాగే 'విశ్వరూపం 2' చిత్రాన్ని వీలైనంత త్వరలో విడుదల చేస్తానని కమల్‌హాసన్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'విశ్వరూపం'చిత్రం పలు సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ చిత్రానికి కొనసాగింపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు కమల్. ఇందులో కథానాయిక పూజాకుమార్‌కు సంబంధించిన సన్నివేశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ హాలీవుడ్ స్టూడియోలో గ్రాఫిక్ సొబగులు అద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి కమల్ మాట్లాడుతూ.. 'విశ్వరూపం' చిత్రాన్ని ప్రజలు విజయవంతం చేశారు. ప్రస్తుతం 'విశ్వరూపం 2' కూడా అనుకున్నట్టుగానే వచ్చింది. విడుదలకు సంబంధించిన పనులు సాగుతున్నాయని అన్నారు.
విశ్వరూపం-2 చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్.....ఎవరితో పోటీ పడకుండా సింగిల్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన 'ఆరంభం' చిత్రం కూడా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ముందు గానీ, తర్వాతగానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నమాట. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో ఇటీవల మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.
విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











