»   »  కమల్ "దశావతారం" ఆడియోకు జాకీ చాన్

కమల్ "దశావతారం" ఆడియోకు జాకీ చాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Hasan
కమలహాసన్ పది పాత్రలు పోషిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దశావతారం చిత్రం ప్రారంభం నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో కమల్ పది పాత్రలు పోషించడం ఓ విశేషమైతే ఈ సినిమాలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికాశెరావత్ నటిస్తుండడం మరో విశేషం.

ప్రస్తుతం ఈ చిత్రం మరో సంచలనాన్ని సృష్టించనుంది. యాక్షన్ చిత్రాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హీరో జాకీచాన్ ఏప్రెల్‌లో జరగనున్న దశావతారం ఆడియో కార్యక్రమానికి అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ కమల్ ఈ చిత్రంలో పది విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు చెప్పగానే ఆశ్చర్యపోయిన జాకీచాన్ ఆడియో విడుదల కార్యక్రమానికి రావడానికి అంగీకరించారని తెలిపారు.

తమిళ చలనచిత్ర ఇండస్ట్రీలో పేరుగాంచిన ఆస్కార్ ఫిలిమ్స్ బేనర్‌పై రూపొందుతోన్న ఈ దశావతారం చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు సంగీతాన్ని అందిస్తుండడం విశేషం.

బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్‌మియా ఈ చిత్రంలోని పాటలకు సంగీతాన్ని అందిస్తుండగా, తెలుగులో మంచి పేరున్న దేవీశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు సైతం ప్రపంచ ప్రసిద్ధి చెందినవారే. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X