»   » ద్యావుడా..! విలన్ రోలా? స్టార్ హీరోలకు కూడా ఇదేం పిచ్చి??

ద్యావుడా..! విలన్ రోలా? స్టార్ హీరోలకు కూడా ఇదేం పిచ్చి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హసన్ ఇండియన్ సినిమా లోనే ఒక యూనిక్ పీస్. కమల్ హసన్ ఆలోచనలు వేరుగా ఉంటాయి, తీసే సబ్జెక్ట్ లూ అంతకన్నా వేరుగా ఉంటాయి. కానీ పాపం కమల్ సొంతగా తీయాలనుకున్న సినిమాలకి ఏమవుతుందో గానీ ఓ పట్టాన తెరమీదకి రావు దాదాపు ఇరవయ్యేళ్ళ కింద మొదలు పెట్టిన మరుదనాయగం అలానే పడి ఉంది. విడుదలకు నోచుకోకుండా పోయి, తానే నిర్మాణ భాధ్యతలు కూడా తీసుకున్న విశ్వరూపం 2 కూడా ఇంకా పూరికాలేదు, గత సంవత్సరం మొదలు పెట్టిన శభాష్ నాయుడు కూడా ఎప్పటికి వస్తుందో అర్థం కావటం లేదు... ఇదే వరుసలో మరో సినిమా కూడా ఉంది.. అందులో కమల్ పాత్ర విలన్ అట......

దేవుడున్నాడు

దేవుడున్నాడు

'కడవుల్ ఇరుక్కాన్' (దేవుడున్నాడు) అనే సినిమా రెండేళ్ల కిందట అనౌన్స్ చేశాడు కమల్. ఈ సినిమాను బైలింగ్యువల్ మూవీగా తమిళం.. హిందీలో చేయాలనుకున్నాడు. హిందీ వెర్షన్‌కు 'అమర్ హై' అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర చేస్తాడని. కమల్ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో సినిమా ఉంటుందనీ అన్నాడు. కానీ ఈ ప్రాజెక్టు కూడా మిగతా వాటి మాదిరే ఆర్థిక కారణాలతో పట్టాలెక్కలేదు.

Shruti Haasan Caught With Her Boyfriend
ఐతే సైఫ్ అలీ ఖాన్

ఐతే సైఫ్ అలీ ఖాన్

ఐతే ఇప్పుడు కమల్ మళ్లీ ఈ ప్రాజెక్టుపై దృష్టిపెట్టాడు. ఈ సినిమాను త్వరలోనే ఆరంభిస్తానని ఆయన ప్రకటించాడు. ఐతే సైఫ్ అలీ ఖాన్ పాత్రకు ఇంకొకరిని ఎంచుకోవాలని కమల్ భావిస్తున్నాడట. తన 'రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్' బేనర్ మీద కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహించబోతున్నాడు.

రవితేజని తీసుకున్నారా?

రవితేజని తీసుకున్నారా?

ఒక దశలో తెలుగు లో కూడా వస్తుందనీ దానిలో ఒక పాత్ర కోసం రవితేజని తీసుకున్నారనీ అన్నారు కానీ అని నిజమా కాదా అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎటూ ఆ ప్రాజెక్ట్ కూడా మూలన పడటం తో అంతా మర్చిపోయారు. అయితే ఇప్పటికి ఉన్న సమాచారం మాత్రం తమిళ, హిందీ భాషల్లోనే తీస్తున్నారని, మరి షూటింగ్ మొదలయ్యే సరికి తెలుగు కూడా అనుకుంటే తెలుగు నటులని తీసుకుంటారా లేక తమిళ డబ్బింగ్ నే మన మొహాన పడేస్తారా అన్నది చూడాలి.

కమల్ పూర్తి స్థాయి నెగెటివ్ రోల్

కమల్ పూర్తి స్థాయి నెగెటివ్ రోల్

ఈ చిత్రంలో కమల్ పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేస్తాడని సమాచారం. ఇదివరకు కూడా దశావతారం లాంటి సినిమాలో నెగెటివ్ రోల్ చేసినా అది అన్ని పాత్రల్లో ఒక పాత్రగా కలిసి పోయింది కానీ ఈసారి మాత్రం కమల్ మొత్తంగా ఒక నెగెటివ్ రోల్ ని తీసుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా తెస్తా..తెస్తా అంటున్నాడు గానీ ఇప్పట్లో అయ్యేలా లేదు.. ఎందుకంటే ఇప్పుడు కమల్ 'విశ్వరూపం-2' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నాడు. ఇంకోవైపు మధ్యలో ఆపేసిన 'శభాష్ నాయుడు'ను కూడా పూర్తి చేయాల్సి ఉంది.

English summary
currently busy with his upcoming movie “Vishwaroopam-2” Kamal is going to start his high budget next directional venture "Kadavulu irukan", As per Reports This Versatile actor going to do the full length negetiv role in this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu