»   » ‘శ్రీమంతుడు’ గురించి కమల్ హాసన్ ఇలా... (వీడియో)

‘శ్రీమంతుడు’ గురించి కమల్ హాసన్ ఇలా... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆగష్టు 7న మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన చిత్రం ‘శ్రీమంతుడు'. ఈ చిత్రం మొదటి ఎనిమిది రోజుల్లో 100కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా క్రాస్ చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ తెస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్ లో సినిమా పూర్తి హౌస్ ఫుల్ కలెక్షన్స్ నడుస్తోంది. అంతేకాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ చూడటం జరిగింది. ఆయన ‘శ్రీమంతుడు' గురించి మాట్లాడారు. ఆయనేం అన్నారో ఇక్కడ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం సాధించిన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ..‘కథని నమ్మి చేసాను. శివగారు మంచి కథ రాసారు. అందరం కథని ఫాలో అయ్యాం. మంచి కథకు టీమ్ వర్క్ తోడయితే ఎంత పెద్ద విజయం సాధిస్తుందో ‘శ్రీమంతుడు' నిరూపించింది. నాన్న, అన్నయ్య, బాబాయ్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చింది అన్నారు.


Kamal Haasan Congratulates Srimanthudu Team including Mahesh Babu & Shruti Haasan

ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అటు ఆడియన్స్ ముఖ్యంగా నా అభిమానులు ఈ విజయానికి ఎంతో ఆనందపడుతున్నారు. నా జీవితంలో ఈ బర్త్ డే రియల్ గా చాలా హ్యాపీగా ఉన్న బర్త్ డే. ఈ సక్సెస్ తో మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి నాకు ఉత్సాహం వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ వియానికి కొరటల శివగారు ముఖ్య కారకులు. ఆయనే ఈ సినిమాకు హీరో అని నా ఫీలింగ్ అన్నారు మహేష్.


Kamal Haasan Congratulates Srimanthudu Team including Mahesh Babu & Shruti Haasan

తొలి చిత్రం అయినా నిర్మాతలు నవీన్, రవి, సివిఎం కాంప్రమైజ్ అవకుండా తీసారు. అన్ని విధాలా నేను సంతృప్తి చెందిన చిత్రం ‘శ్రీమంతుడు'. నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఫిలిం ‘శ్రీమంతుడే' అన్నారు మహేష్ బాబు. ఈ సినిమా తొలి వారం విజయవంతంగా పూర్తి చేసుకుని వరల్డ్ వైడ్ షేర్ : రూ. 66,57,99,056 షేర్ సాధించింది.


అలాగే కమల్ గురించి గతంలో మహేష్ బాబు ఇలా మాట్లాడారు.


English summary
Kamal Haasan happened to see the latest Mahesh Babu - Shruti Haasan starrer, Srimanthudu, and this is what he had to say through a video message which was released now.
Please Wait while comments are loading...