»   » రీమేక్: హీరో కమల్ హాసన్ కూడా నగ్నంగా?

రీమేక్: హీరో కమల్ హాసన్ కూడా నగ్నంగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు త్వరలో వెండితెరపై నగ్నంగా దర్శనమివ్వబోతున్నాడా? ఒంటిపై నూలుపోగు లేకుండా నటించబోతున్నాడా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ నుండి. ఆయన త్వరలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పికె' సౌత్ రీమేకులో నటించబోతున్నారట.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కించడానికి జెమినీ ఫిల్మ్ సర్య్కూట్ సంస్థ ప్లాన్ చేస్తోందట. విలక్షణ నటనకు అవకాశం ఉండటంతో కమల్ హాసన్ కూడా ఈ చిత్రం రీమేకులో నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బాలీవుడ్ మూవీ ‘పికె'లో అమీర్ ఖాన్ నగ్న అవతారం సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. మూడ నమ్మకాలపై సెటైర్లు వేస్తూ దొంగబాబా మోసాలను ఎండగడుతూ సందేశాత్మకంగా ఈచిత్రం సాగుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Kamal Haasan for ‘pk’ remake

కమల్ హాసన్ ప్రస్తుత్తం ‘ఉత్తమ విలన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చి 1న ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కమల్ హాసన్ ఈ చిత్రంలో రంగస్థల కళాకారుడిగా, సినీ నటుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఈ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ ఈ విషయాలను తెలియజేసారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని ఆస్కార్ అవార్డు గ్రహీత క్రైగ్ ఆధ్వర్యంలో అమెరికాలో జరుపుతున్నారు. ఈ చిత్ర గీతాల్ని మార్చి1న, సినిమాను ఏప్రిల్ 2 విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఈ చిత్రంలో పాటు కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజాకుమార్, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు.

English summary
It is learnt that the popular production house ‘Gemini Productions’ has bagged the remake rights of ‘pk’ and Kamal is being finalised to play the lead role in this project which is going to commence shooting in a couple of months.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu