»   » విడిపోతున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్-గౌతమి

విడిపోతున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్-గౌతమి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు 13 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి గౌతమిలు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గౌతమి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుండి ఎన్నో నేర్చుకున్నానని, తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం ఇదని ఆమె తెలిపారు. సినీ పరిశ్రమకు రాక ముందే కమల్ తన కలల హీరో అని గౌతమి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కమల్ కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు. గౌతమికి పలు విపత్కర సందర్భాల్లో కమల్ అండగా నిలిచారు. కమల్ హాసన్ తో సహజీవనానికి ముందు ప్రముఖ వ్యాపార వేత్త సందీప్ బాటియాను 1998లో పెళ్లాడారు. వీరిద్దరికి పెట్టిన కూతురే సిద్ధు లక్ష్మి. పెళ్లయిన మరుసటి ఏడాదే భర్త నుండి విడాకులు తీసుకున్నారు. 2003 నుండి ఆమె కమల్ తో సహజీవనం చేస్తున్నారు. తెలుగులో వచ్చిన విచిత్ర సోదరులు సినిమా నుండి కమల్, గౌతమి స్నేహం చిగురించింది. తమ సహజీవనంపై వీరు గతంలో మాట్లాడుతూ వివాహ బంధంపై తమకు అంత విశ్వాసం లేక పోవడం వల్లనే సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు.

English summary
The renowned south Indian actor Kamal Haasan and actress Gauthami who were living together for the last 13 years have separated. Gauthami has announced the separation through a writing on her blog.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu