twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌కి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్

    By Srikanya
    |

    ముంబై : ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ మరొక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం అందుకోబోతున్నారు. ముంబయి అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజెస్‌ (ఎమ్‌.ఎ.ఎమ్‌.ఐ) ఆధ్వర్యంలో ఏటా చిత్రోత్సవాలు జరుగుతుంటాయి. అక్టోబరు 17 నుంచి ముంబైలో ఈ 15వ యేడాది చిత్రోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో కమల్‌హాసన్‌ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు. ఆయనతో పాటు ఫ్రెంచ్‌ చలనచిత్ర నిర్మాత కోస్టా గావర్స్‌ కూడా ఈ పురస్కారం స్వీకరించబోతున్నారు.

    చిత్రోత్సవాలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్‌ బెనగల్‌ మాట్లాడుతూ ''కమల్‌ ఓ దిగ్గజం. ఆయనలో రచయిత, గాయకుడు, దర్శకుడు, నటుడు, గేయ రచయిత ఇలా ఎన్నో రూపాలున్నాయి. అలాగే కోస్టా గావర్స్‌ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు 'జెడ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన సినిమా మానవతా విలువలను తెరపై చక్కగా ఆవిష్కరించింది. వారిద్దరికీ పురస్కారాలను అందజేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది''అన్నారు.

    ఇక కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' ఈ ఏడాది సంచలన విజయాల్లో ఒకటిగా నిలచింది. ముగింపులో 'విశ్వరూపం-2' కోసం వేచి చూడండి అంటూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన కమల్‌ ప్రస్తుతం సీక్వెల్‌ను పూర్తి చేసేందుకు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలను కొడైకానల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15 నాడు తెరపైకి వస్తుందనే వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. దీపావళికి విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుకున్నదానికంటే షూటింగ్‌ తొందరగా ముగియటం, నిర్మాణాంతర పనుల్ని కూడా పూర్తి చేసి దీపావళి నాటికి థియేటర్లలోకి తెచ్చేందుకు చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిసింది.

    ఈ రెండో భాగంలో కథ చాలా వరకూ మన దేశం నేపథ్యంగానే సాగుతుంది. త్వరలో ఢిల్లీలో కొన్ని ఘట్టాలు చిత్రించబోతున్నారు. 'విశ్వరూపం 2'ని ఆగస్టులో విడుదల చేయాలన్నది కమల్‌హాసన్‌ ఆలోచన. తొలి భాగంలోని నటీనటులు చాలామంది కొనసాగింపులోనూ నటిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తెరపై 'విశ్వరూపం'లో ఆవిష్కరించారు కమల్‌హాసన్‌. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఆ చిత్రం పలు వివాదాలను సృష్టించింది. ప్రస్తుతం కమల్‌ 'విశ్వరూపం 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు.

    ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు. కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

    English summary
    Renowned Indian actor-director Kamal Haasan will be felicitated with the Lifetime Achievement Awards at the 15th Mumbai Film Festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X