»   » ట్వీట్టర్ లో జాయిన్ అయిన కమల్ హాసన్.. ఐడీ ఇది

ట్వీట్టర్ లో జాయిన్ అయిన కమల్ హాసన్.. ఐడీ ఇది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: విశ్వనటుడు కమల్ హాసన్ ...తాజాగా నిన్న రాత్రే ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. తన అభిమానులుకు ఇక నుంచి కంటిన్యూగా తన సినిమాల గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వనున్నారు. ఆయన ట్విట్టర్ ఐడి...@maiamkhassan. తను ట్విట్టర్ ఎక్కౌంట్ ఓపెన్ చెయ్యటానికి శేఖర్ కపూర్ ప్రేరణ ఇచ్చారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆయన మొదటి ట్వీట్ గా రాసారు.

కమల్ తాజా చిత్రం 'విశ్వరూపం 2' . ప్రస్తుతం థాయ్‌లాండ్‌ సముద్ర తీర ప్రాంతాల్లో 'విశ్వరూపం 2' ఫైట్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కమల్‌, ఆండ్రియాలపై షూటింగ్ సాగుతోంది.

ఈ రెండో భాగంలో కథ చాలా వరకూ మన దేశం నేపథ్యంగానే సాగుతుంది. త్వరలో ఢిల్లీలో కొన్ని ఘట్టాలు చిత్రించబోతున్నారు. 'విశ్వరూపం 2'ని ఆగస్టులో విడుదల చేయాలన్నది కమల్‌హాసన్‌ ఆలోచన. తొలి భాగంలోని నటీనటులు చాలామంది కొనసాగింపులోనూ నటిస్తున్నారు.

అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తెరపై 'విశ్వరూపం'లో ఆవిష్కరించారు కమల్‌హాసన్‌. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఆ చిత్రం పలు వివాదాలను సృష్టించింది. ప్రస్తుతం కమల్‌ 'విశ్వరూపం 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు.

English summary
Kamal Haasan joined Twitter last night and thanked his friend and co-star Shekhar Kapur for inspiring him to create a Twitter profile. “shekharkapur has inspired me to take up this platform. Would like to share my thoughts and engage in thought provoking discussions,” Kamal Haasan posted on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu