»   » ఈ జీవితాన్ని ప్రసాదించింది కమల్.. పతనం కాకుండా కాపాడాడు.. రజనీ

ఈ జీవితాన్ని ప్రసాదించింది కమల్.. పతనం కాకుండా కాపాడాడు.. రజనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారా? అనే ప్రశ్నకు అవును అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. వీరిద్దరు 80 దశకాల్లో తమిళ సినిమా రంగానికి భారీ హిట్లను అందించారు. వ్యక్తిగతంగా కొన్ని విషయాలలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ తమిళ వెర్షన్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యహరిస్తూ తొలిసారి టెలివిజన్ రంగానికి కమల్ హాసన్ పరిచయం అవుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కమల్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో కలిసి ఓ చిత్రంలో నటించే అవకాశం ఉంది అని తెలిపారు.

త్వరలో కలిసి నటిస్తాం..

త్వరలో కలిసి నటిస్తాం..

ఒకవేళ మేమిద్దరం నటించే సినిమాకు రజనీకాంత్ దర్శకత్వం వహించారు. నేను లేదా మరొకరు డైరెక్ట్ చేస్తారు. రజనీతో సినిమా చేస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మధ్య ఓ కార్యక్రమంలో మా పాత రోజులను రజనీ గుర్తుచేశారు అని కమల్ తెలిపారు. అంతేకాకుండా వారి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంఘటనను షేర్ చేసుకొన్నారు.

అలా కాపాడాడు..

అలా కాపాడాడు..

ఆ మధ్య మేము సినిమాల్లో నటిస్తున్న తొలినాళ్లలో మోటర్ బైక్‌పైన వెళ్లే సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా బైక్ స్కిడ్ అయింది. వెంటనే రజనీ నన్ను మోటార్ బైక్ నడపటం వచ్చా అని అడిగారు. అందుకు వచ్చు నేను సమాధానం చెప్పాను. అంతేకాకుండా ఒకవేళ నేను పడినా నిన్ను పడకుండా జాగ్రత్త తీసుకొంటాను అని కమల్ చెప్పాడు. కమల్ మాట నా హృదాయాన్ని తాకింది అని రజనీ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పడం అందర్నీ ఆకట్టుకొన్నది.

అప్పటి నుంచి పతనమైన..

అప్పటి నుంచి పతనమైన..

కమల్ చెప్పిన మాటనే నిజమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కెరీర్‌లో పతనమైన సందర్భాలు లేవు. 1983లో సినిమాలతోపాటు అన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకొంటున్న సమయంలో కమల్ నన్ను మళ్లీ ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. నిరాశ, నిస్ఫృహలను దూరం చేశాడు. త్వరలోనే మేమిద్దరం కలిసి ఓ చిత్రంలో నటిస్తాం. గత ఐదేళ్లుగా దీనిపై చర్చిస్తున్నాం. ప్రేక్షకులకు మా మీద ఉన్న అంచనాలు చూసి భయపడుతున్నాం అని రజనీ చెప్పారు.

విశ్వరూపం2లో..

విశ్వరూపం2లో..

ఇదిలా ఉండగా కమల్ హాసన్ విశ్వరూపం2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమంలో బిజిగా ఉన్నారు. అలాగే రజనీ రోబో సినిమా షూటింగ్‌‌లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం రజనీ సంసిద్ధమవుతున్నాడు.

పా రంజిత్ సినిమాలో హ్యూమా ఖురేషి

పా రంజిత్ సినిమాలో హ్యూమా ఖురేషి

కబాలీ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చెనెల ముంబైలో ప్రారంభం కానున్నది.

English summary
Kamal Haasan, who is making his television debut with the Tamil version of Big Boss, went on the record saying that he might do a film with Rajinikanth. He said, It depends. He said if we do a film together he won't direct it. It has to be either me or someone else. It would be quite interesting to do a film with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu