అమల తో కమల్ 'అమ్మా నాన్న ఆట'
హైదారాబాద్: చీకటి రాజ్యం రిలీజ్ అయిన నాలుగు రోజులకే మరో కోత్త సినిమాని ఎనౌన్స్ చేసారు కమల్. ఒకప్పటి విజయవంతమైన జోడీతో ఇప్పుడు సిల్వర్ స్ర్కిన్ పై కనువిందు చేయనున్నారు.
కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో, అలనాటి వయ్యారి, 'కింగ్ నాగార్జున' భార్య అమల ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించడమ విశేషం. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.ఇందులో మరో ముఖ్య నటి జరీనా వహబ్.

కమల్ మాట్లాడుతూ.. ''ప్రేమ, వినోదం కలిగిన కుటుంబ కథా చిత్రం అని, పేరుకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుందని, చాల కాలం తర్వతా అమలతో కలసి నటించబోతుండటం ఆనందంగా ఉంది. ఆమె కాకుండా ఇందులో ఇంకో హీరోయిన్ కూడా ఉంది. మరి నేను ఎవరితో రొమాన్స్ చేస్తాననేది సస్పెన్స్ '' అన్నారు.


Click it and Unblock the Notifications











